గాంధీకి ఘన నివాళి
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:49 AM
పట్టణంలో మహాత్మా గాంధీ వర్ధంతిని శుక్రవారం ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు.
బనగానపల్లె, జనవరి 30(ఆంధ్రజ్యోతి): పట్టణంలో మహాత్మా గాంధీ వర్ధంతిని శుక్రవారం ఆర్యవైశ్య సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆఽధ్వర్యంలో వాసవీభవనలో గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్ర మంలో గాథంశెట్టి వేణుగోపాల్, శ్రీరామ వెంకటసుబ్రహ్మణ్యం, గుం డా రవికుమార్, జక్కాశ్రవణ్, ప్రసాద్, జంగంశెట్టి, గుండా సుప్రజ, శివచంద్రయ్య, భరతుడు, బలరాం, గుండా శ్రీనివాసులు పాల్గొన్నారు.
బేతంచెర్ల: స్థానిక అమ్మవారిశాలలో వాసవీ క్లబ్ అధ్యక్షుడు వెంకటరమణ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి వాసవీ క్లబ్ సభ్యులు నివాళులర్పించారు. కార్యక్రమంలో వాసవీ క్లబ్ వైస్ గవర్నర్ బొగ్గరపు ధనుంజయ, క్యాబినెట్ సెక్రటరీ బాల్లని సూర్య, వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి మధు సురేంద్ర, కోశాధికారి జగన కుమార్, రాజేంద్ర కుమార్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
చాగలమర్రి: గాంధీజీ ఆశయాలు చిరస్మరణీయమని ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు లక్ష్మణబాబు అన్నారు. శుక్రవారం గాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక గాంధీ సెంటర్‌లో వెలసిన గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. ఆర్యవైశ్యులు లక్ష్మీనారాయణ, నవతాప్రసాద్, మల్లికార్జున, సత్యం, మధు, వినోద్‌కుమార్, శశికుమార్, నాగేంద్రగుప్త పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ: పట్టణంలో గాంధీజీ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీసెంటర్‌లోని గాంధీ విగ్రహానికి అపుస్మా నియోజక వర్గం యూనిట్ అధ్యక్షుడు అమీర్‌బాషా ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కోశాధికారి చంద్రశేఖర్, ప్రజ్ఞా కళాశాల ప్రిన్సిపాల్ నాగమహేష్, ఉపాధ్యాయులు నాగేంద్ర, పెద్దఓబులేసు పాల్గొన్నారు.
.