Share News

గిరిపుత్రుల మల్లన్న స్పర్శ దర్శనం

ABN , Publish Date - Oct 28 , 2026 | 11:14 PM

: శ్రీశైల క్షేత్రంతో బుధవారం చెంచులు మల్లన్న ఉచిత స్పర్శ దర్శనం చేసుకున్నారు.

గిరిపుత్రుల మల్లన్న స్పర్శ దర్శనం
ప్రధానాలయంలో నృత్యం చేస్తున్న చెంచులు

శ్రీశైలం, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంతో బుధవారం చెంచులు మల్లన్న ఉచిత స్పర్శ దర్శనం చేసుకున్నారు. దేవస్థానంలో చెంచుకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా దేవస్థానం అధికారులు నెలలో ఒకరోజు మల్లన్న ఉచిత స్పర్శ దర్శనం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మేకలబండ, హఠకేశ్వరం, మార్కాపురం ప్రాంతాలకు చెందిన 250 మందితోపాటు నంద్యాల, మాచర్ల ప్రాంతాల చెంచులు మధ్యాహ్న సమయంలో గర్భాలయ స్పర్శ దర్శనం చేసుకున్నట్లు ఏపీఆర్‌వో యల్లా శేఖర్‌రెడ్డి తెలిపారు. వీరికి ఆలయ అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికి ఆదిదంపతుల దర్శనం చేయించారు.

Updated Date - Oct 28 , 2026 | 11:14 PM