స్థిరమైన పారిశుధ్య సంస్కృతిని అమలు చేయాలి
ABN , Publish Date - Mar 27 , 2026 | 11:30 PM
స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న నిర్వహించనున్న జీరో వేస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్ (వ్యర్థ రహిత సంస్థలు) థీమ్ ద్వారా స్థిరమైన పారిశుధ్య సంస్కృతిని అమలు చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న నిర్వహించనున్న జీరో వేస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్ (వ్యర్థ రహిత సంస్థలు) థీమ్ ద్వారా స్థిరమైన పారిశుధ్య సంస్కృతిని అమలు చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె తమ క్యాంపు కార్యాలయం నుంచి స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమ అమలుపై అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయం, పాఠశాల, అంగన్‌వాడీ తదితర సంస్థల్లో ఈ కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేయాలని అన్నారు. స్థిరమైన పారిశుఽధయ సంస్కృతికి నాంది పలికే ఉద్యమంగా దీన్ని భావించాలన్నారు.