ఆరు దశాబ్దాల కల సాకారం
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:19 PM
తన తండ్రి హయాం నుంచి సున్నిపెంటకు గ్రామస్థాయి హోదా రావాలనే ఆరవై సంవత్సరాల చిరకాల స్వప్నం నేడు సాకారమైందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి అన్నారు.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
శ్రీశైలం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): తన తండ్రి హయాం నుంచి సున్నిపెంటకు గ్రామస్థాయి హోదా రావాలనే ఆరవై సంవత్సరాల చిరకాల స్వప్నం నేడు సాకారమైందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీశైలం రెడ్ల కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ సున్నిపెంట గ్రామంలో నివసిస్తున్న వారికి సంపూర్ణ గ్రామాధికారాలు, హక్కులు కలిగిలేకపోవడం బాధాకరమని అన్నారు. గతంలోనూ టీడీపీ హయాంలోనే గ్రామపంచాయతీగా ప్రకటించినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఇక్కడి ప్రజల సంక్షేమానికి ఏమాత్రం తోడ్పాటునందించలేదని అన్నారు. ప్రస్తుతం 10వేలకుపైగా జనాభా కలిగి ఉండి 14 వార్డులు ఉన్న సున్నిపెంట గ్రామానికి ఎన్నికలు నిర్వహించాలని నోటిఫికేషన్ విడుదలైందని అన్నారు. అదే విధంగా ఎన్నికలు ఏకగ్రీవమైతే గ్రామాభివృద్ధి రెట్టింపు అవుతుందన్నారు. సున్నిపెంట అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ ప్రభుత్వానికి అనవసరమైన పిటీషన్లు పెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తూ ప్రజా సంక్షేమాన్ని మరింత వెనక్కి నెట్టే వారు తమ చర్యలు మానుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రమణ, సుబ్బారెడ్డి, వట్టి వెంకటరెడ్డి, గెల్లి వెంకటేశ్వర్లు, మక్బుల్, జిలాని, సుభాని, మహమ్మద్ భాషా, పాపారావు పాల్గొన్నారు.