Share News

బాలికకు టీకా వేస్తున్న దృశ్యం

ABN , Publish Date - Mar 12 , 2026 | 11:43 PM

మహిళ ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకాలు ఉచితంగా వేసేందుకు సన్నాహాలు చేశారు.

బాలికకు టీకా వేస్తున్న దృశ్యం

మహిళల ఆరోగ్యానికి పెద్దపీట

హెచ్‌పీవీ టీకాతో క్యాన్సర్‌ నుంచి విముక్తి

మొదటి విడతగా 7,700 టీకాలు వేసేందుకు ఏర్పాట్లు

నంద్యాల హాస్పిటల్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మహిళ ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకాలు ఉచితంగా వేసేందుకు సన్నాహాలు చేశారు. జిల్లాలో మొదటి విడతగా 7700 టీకాలు వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా టీకాలు వేయడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాంతకమైన ఈ వ్యాధి నుంచి రక్షించుకునేందుకు హెచ్‌పీవీ టీకా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వ్యాక్సిన్‌ మార్కెట్‌లో దాదాపు రూ. 5వేలు విలువ చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.

జిల్లాలో 11 కేసులు

ఎన్‌సిడి 4.0 సర్వేలో జిల్లాలో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు 11 మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జిల్లాలో 18ఏళ్ల వయస్సుపై పడిన వారిని దాదాపు 6 లక్షల మందిపై సర్వే చేయగా ఈ కేసులు నమోదయ్యాయి.

20వేల మంది లక్ష్యం

జిల్లావ్యాప్తంగా 20వేల మంది మహిళలకు హెచ్‌పీవీ టీకాలు వేయడం లక్ష్యం. ప్రస్తుతం 7700 అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మూడు డోసులు వేస్తాం. విలువైన వ్యాక్సిన్‌ ఉచితంగా వేయడం సంతోషంగా ఉంది.

డాక్టర్‌ ఆర్‌ వెంకటరమణ, డీఎంహెచ్‌వో, నంద్యాల

Updated Date - Mar 12 , 2026 | 11:43 PM