Share News

రూ.26 వేల వేతనం ఇవ్వాలి

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:53 PM

అంగన్‌వాడీలకు నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని సీఐటీయూ మండల అధ్యక్షుడు గఫూర్‌మియా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రూ.26 వేల వేతనం ఇవ్వాలి
నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలు, సీఐటీయూ నాయకులు

అంగన్‌వాడీల నిరసన

కోడుమూరు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీలకు నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని సీఐటీయూ మండల అధ్యక్షుడు గఫూర్‌మియా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయం ముందు మంగళవారం అంగనవాడీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలకు జీతాలు పెంచుతామని చెప్పిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వారి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడకపోతే రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జీపీ వీరన్న గూడూరు, కోడు మూరు, సి.బెళగల్‌ అంగన్‌వాడీలు రేణుకమ్మ, భాగ్మమ్మ, రజియా, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 11:53 PM