Share News

పకడ్బందీగా మద్యం పాలసీ

ABN , Publish Date - Aug 25 , 2026 | 11:03 PM

ప్రభుత్వం తెచ్చిన మద్యం పాలసీని పడ్బందీగా ఆమలు చేయాలని ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌, రాష్ట్ర డైరెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ ఆదేశించారు.

పకడ్బందీగా మద్యం పాలసీ
ఎక్సైజ్‌ అధికారులతో సమీక్షిస్తున్న రాష్ట్ర డైరెక్టర్‌

ఎక్సైజ్‌ శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ చామకూరి శ్రీధర్‌

కర్నూలు అర్బన్‌ ,ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం తెచ్చిన మద్యం పాలసీని పడ్బందీగా ఆమలు చేయాలని ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌, రాష్ట్ర డైరెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ ఆదేశించారు. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఎన్ఫోర్సుమెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌ దేవ్‌ శర్మతో కలిసి ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం క్యాంప్‌సలో ఉన్న కెమికల్‌ ఎగ్జామినర్‌ ల్యాబ్‌ను పరిశీలించి నూతనంగా ఏర్పాటు చేసిన పరికరాల పని తీరును పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్‌ చేరుకుని నంద్యాల, కర్నూలు జిల్లాల ఎక్సైజ్‌ శాఖ అధికారులు, సీఐలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని నవోదయం అమలు తీరును ప్రశంసించారు. నాటు సారా తయారీ, అమ్మకాలను పూర్తిగా మానేసిన వారికి ప్రత్యేకంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న తీరును అభినందించారు. ఇంకా అలాంటి వారిని నాటు సారా తయారీకి దూరంగా ఉంచేందుకు జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కర్నూలు, కోడుమూరు, కోసిగి, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, కోవెలకుంట్ల ఎక్సైజ్‌ స్టేషన్ల పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌ ఆదాయం తగ్గుదలకు గల కారణాలను విశ్లేషించారు. కర్నూలు, పత్తికొండ, డోన్‌, బనగానపల్లే స్టేషన్ల పరిధిలో నాటు సారా పూర్తిగా నిర్మూలించాలని ఆదేశించారు. కర్నూలు స్టేషన్‌ పరిధిలో నాటు సారా తయారీని మానేసిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించడం పట్ల ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ పీ. శ్రీదేవి, అసిస్టెంట్‌ కమిషనర్‌ వి. హనుమంతరావు, సూపరింటెండెంట్‌ ఎం. సుధీర్‌ బాబు, డిపో మేనేజర్‌ శ్రీధర్‌ రావు, ఏఈఎ్‌సలు రాజశేఖర్‌గౌడ్‌, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2026 | 11:03 PM