Share News

మారేమడుగుల వాసికి అరుదైన గౌరవం

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:24 PM

అవుకు మండలం కొండమనాయునిపల్లె మజరా గ్రామమైన మారేమడుగుల మారుమూల గ్రామం.

మారేమడుగుల వాసికి అరుదైన గౌరవం
పురస్కారాన్ని అందుకుంటున్న జనార్దన్‌రెడ్డి

సైనిక విభాగంలో సుబేదార్‌ మేజర్‌గా పదోన్నతి

అవుకు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి) : అవుకు మండలం కొండమనాయునిపల్లె మజరా గ్రామమైన మారేమడుగుల మారుమూల గ్రామం. ఈ గ్రామానికి చెందిన ఉల్లెమ్మగారి జనార్దన్‌రెడ్డి గురువారం కేంద్ర సైనిక విభాగదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన 1999లో ఆర్మీలో చేరారు. జలంధర్‌, జమ్మూ, శ్రీనగర్‌, రాజస్థాన్‌ ప్రాంతాల్లో నాయక్‌, హవల్దార్‌, సుబేదార్‌ వివిధ పోస్టుల్లో పనిచేశారు. 2010 నుంచి 2014 వరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద పనిచేసే జాతీయ భద్రత దళంలో కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం గుజరాత్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో కేంద్రం సుబేదార్‌ మేజర్‌గా నియమించింది. గ్రామ ప్రజలు, మిత్రులు బంధువులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Updated Date - Jan 01 , 2026 | 11:24 PM