Share News

తుంగభద్రపై శాశ్వత వంతెన నిర్మించాలి

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:30 AM

కర్నూలు నగరం- గొందిపర్ల గ్రామం మధ్య తుంగభద్ర నదిపై శాశ్వత వం తెన నిర్మించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు క్రాంతినాయుడు, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త అనంత రత్నం, కర్నూలు నగర అధ్యక్షుడు షేక్‌ జిలాని బాషా సోమవారం కలెక్టర్‌ను వినతి పత్రం అందజేశారు.

తుంగభద్రపై శాశ్వత వంతెన నిర్మించాలి
కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

కర్నూలు కలెక్టరేట్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరం- గొందిపర్ల గ్రామం మధ్య తుంగభద్ర నదిపై శాశ్వత వం తెన నిర్మించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు క్రాంతినాయుడు, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త అనంత రత్నం, కర్నూలు నగర అధ్యక్షుడు షేక్‌ జిలాని బాషా సోమవారం కలెక్టర్‌ను వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ కోడు మూరు నియోజకవర్గంలోని గొందిపర్ల, దొడ్డిపాడు, పూలతోట, దేవమాడ, కాసాపురం, తాండ్రపాడు, బైౖరాపురం, బసాపురం, పంచ లింగాల తదితర 15 గ్రామాలకు చెందిన ప్రజలకు నది అడ్డంగా ఉండటంతో 15 కిలోమీటర్లు చుట్టి కర్నూలుకు రావాల్సి వస్తోంది అన్నారు. జోగులాంబ పుణ్యక్షేత్రానికి ఉన్న 40 కిలో మీటర్ల దూరం ఈ బ్రిడ్జితో 10 కిలో మీటర్లకి తగ్గుతుందని తెలిపారు.

Updated Date - Aug 11 , 2026 | 12:30 AM