అనగనగా ఓ నర్సరీ కథ
ABN , Publish Date - May 04 , 2026 | 11:37 PM
హరినగరం సమీపంలో 20 ఏళ్లక్రితం ఉద్యాన నర్సరీ ఏర్పాటు చేసేందుకు అప్పటి కలెక్టర్ దానకిశోర్, నాటి ఎమ్మెల్యే గంగుల ప్రతా్‌పరెడ్డి శిలాఫలకం వేశారు.
20 ఏళ్ల కిత్రతం శిలాఫలకం ఫ ఆ తర్వాత పట్టించుకోని పాలకులు
పిచ్చిమొక్కలతో నిండిన నర్సరీ ప్రాంతం
రైతులు, ప్రజలకు అందని పండ్ల మొక్కలు
రుద్రవరం, మే 4 (ఆంధ్రజ్యోతి) : హరినగరం సమీపంలో 20 ఏళ్లక్రితం ఉద్యాన నర్సరీ ఏర్పాటు చేసేందుకు అప్పటి కలెక్టర్ దానకిశోర్, నాటి ఎమ్మెల్యే గంగుల ప్రతా్‌పరెడ్డి శిలాఫలకం వేశారు. సుమారు పది ఎకరాల్లో విస్తీర్ణంలో నర్సరీ ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించారు. అనంతరం పట్టించుకోకపోవడంతో ఉద్యానవనం శిలాఫలకానికే పరిమితమైంది. నల్లమల తీరంలోని రైతులకు పండ్ల మొక్కలు అంద ని ద్రాక్షలా మారాయి.
ప్రభుత్వాలు మారినా..
20 ఏళ్లుగా ఎన్నో ప్రభుత్వాలు, అధికారులు మారినా ఈ నర్సరీని పట్టించుకునే నాథుడు లేడు. దీంతో రైతులకు పంట్ల మొక్కలు అందడం లేదు. ఈ ప్రాంతంలో ఎర్ర, ఇసుక నేలలు ఉన్నాయి. నర్సరీ ఏర్పాటయితే తమకు సౌకర్యంగా ఉంటుందన్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి.
నర్సరీలో పిచ్చిమొక్కలు
ఉద్యాన నర్సరీ భూముల్లో పిచ్చిమొక్కలు, ముళ్లకంప ఏపుగా పెరిగింది. గేటును కూలింది, ఇలాగే వదిలేస్తే నర్సరీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని రైతులు, పర్యావరణ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తరకం మొక్కలు అందించాలనే..
ఉద్యాన నర్సరీ పరిస్థితిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఉద్యాన నర్సరీలో కొత్త మొక్కలు అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం. పండ్ల మొక్కల్లో ఆవకాడ ఇతర మొక్కలు అందుబాటులోకి తెస్తాం. - దస్తగిరి, ఉద్యానశాఖ అధికారి