Share News

వైసీపీకి ఝలక్‌

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:23 AM

స్థానిక సంస్థల ముంగిట వైసీపీ ఝలక్‌ తగిలింది. కల్లూరు అర్బన 45వ వార్డు వైసీపీ చెందిన 50 కుటుంబాలు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచ రితారెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వైసీపీకి ఝలక్‌
టీడీపీలో చేరిన వారితో గౌరు దంపతులు

టీడీపీలోకి 50 కుటుంబాలు

కల్లూరు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ముంగిట వైసీపీ ఝలక్‌ తగిలింది. కల్లూరు అర్బన 45వ వార్డు వైసీపీ చెందిన 50 కుటుంబాలు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచ రితారెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం మాధవీనగర్‌ క్యాంపు కార్యాల యంలో శివప్పనగర్‌ వైసీపీ ముఖ్య నాయకుడు రామారావుతోపాటు 50 కుటుంబాలు టీడీపీలో చేరారు. టీడీపీ యువ నాయకుడు గౌరు జనార్దన రెడ్డితో పాటు, గౌరు దంప తులు టీడీపీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చిన్న సుంకన్న, తాటికొండ మారెన్న, బదిగ మారెన్న, పెద్ద సుం కన్న, హనుమంత, ఎల్లప్ప, కడమంచి, ముగ్గు గోవిందు, శాంతరాజు, మహేష్‌, డొక్కా ఈరన్న, డొక్కా జమ్మయ్య, బదిగ పెద్దూరు, కొండ్ర ఎల్లప్ప, అంపయ్య, ఎల్లమ్మ, మారెమ్మ ఉన్నారు. కల్లూరు అర్బన 25 వార్డుకు చెందిన ఏపీ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జీవీ చంద్రిక, బత్తుల నాగమల్లి, సర్వేశ్వరరావు, చింతలపల్లి లక్ష్మీకాంత, రాఘ వేంద్ర, తిరుపతయ్య, చల్లా వెంకటేశ, జానకీరాం, బండ రవి, వరప్రసాదరావు, శివశంకర్‌, రామకృష్ణ, మద్దిలేటిలు గౌరు దంపతుల సమక్షంలో టీడీపీలో చేరా రు. కార్యక్రమంలో కల్లూరు కన్వీకర్‌ పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌ యాదవ్‌, రవిప్రకా ష్‌రెడ్డి, జంగాల సుంకన్న, రాములమ్మ, బుల్లెట్‌ సుంక న్న, ఎల్లన్న పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2026 | 12:23 AM