Share News

సర్‌ పేరుతో ఓట్ల తొలగింపునకు భారీ కుట్ర

ABN , Publish Date - Jul 02 , 2026 | 11:25 PM

‘సర్‌’ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు అనుకూలమైన ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తోందని, దీనివల్ల అర్హులైన లక్షలాది మంది ఓటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు.

సర్‌ పేరుతో ఓట్ల తొలగింపునకు భారీ కుట్ర
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య

అమరావతి పేరుతో లక్షల కోట్ల దోపిడీ

ఆగస్టు 6 నుంచి 15 వరకు పాదయాత్రలు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య

కర్నూలు అర్బన్‌/ ఎడ్యుకేషన్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ‘సర్‌’ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు అనుకూలమైన ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తోందని, దీనివల్ల అర్హులైన లక్షలాది మంది ఓటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. కర్నూలు జిల్లా కేంద్రంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న సర్‌ ఓటర్ల ప్రక్రియ కనీసం ఫారాలు పూర్తి చేయలే ని బీఎల్‌వోలను నియ మించడం దారుణమన్నారు. గ్రామ సభల్లో అవగాహన కల్పించడంలో విఫలం చెందారని దీని వల్ల ఎంతో మంది అర్హులైన ఓటర్లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన సమయం సరిపోవడం లేదని కనీసం 3 మాసాలైనా గడువును పొడిగించి, కర్ణాటక రాష్ట్రంలో మంత్రి వర్గం 14 అంశాలపై ప్రతి పాదనలు చేసిందని, మన రాష్ట్రంలో కూడా అటువంటి అంశాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రవిదేశాంగ భారత హై కమిషన్‌ ఇచ్చిన గుర్తింపు పాస్‌పోర్టు నేడు గుర్తింపునకు సరిపోదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆధార్‌, రేషన్‌, పాన్‌, పాస్‌పోర్టు లాంటి ఆధారాలు సరిపోవడం లేదని చెప్పడం శోచనీయమన్నారు. నేడు దేశంలో విద్యా, వైద్యం కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి పోయిందని, విద్యా పేరుతో విద్యార్థుల తల్లితండ్రుల నుండి లక్షల కోట్ల రూపాయాలు కార్పొరేట్‌ కాలేజీలు దండుకుంటున్నాయని ఽధ్వజమెత్తారు. గ్యాస్‌, పెట్రోల్‌, డిజిల్‌ వల్ల నిత్యావసర సరుకుల ధరలు సామాన్య మద్య తర గతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ ఆగస్టు 6 నుండి 15 వరకు సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సెప్టెంబరు 1న ఛలో డిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి రాష్ట్రం నుంచి రెండు వేల మంది ఢిల్లీకి వెళ్లి ఎన్డీఏ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Jul 02 , 2026 | 11:25 PM