హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Aug 30 , 2026 | 12:17 AM
కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక కోట్ల సర్కిల్‌లో శనివారం న్యాయవాదులు నిరసన చేపట్టారు.
కోడుమూరు, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక కోట్ల సర్కిల్‌లో శనివారం న్యాయవాదులు నిరసన చేపట్టారు. న్యాయ వాది పవన్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ మంత్రి నారా లోకేశ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా 90రోజుల్లో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికే 30రోజులు గడిచాయని, ఇంతవరకు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. సీపీ ఎం నాయకులు గఫూర్‌మియా, వీరన్న సంఘీభావం వ్యక్తం చేశారు. న్యాయవాదులు సోమశంకర్‌యాదవ్, సోమేష్, కురుమన్న, రవి కుమార్‌యాదవ్, మధు, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.