Share News

హైకోర్టు బెంచను ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:28 AM

కర్నూలులో హైకోర్టు బెంచను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఏర్పాటు చేయాలని కర్నూలు బార్‌ అసోసియేషన అధ్యక్షులు బి. చంద్రుడు బుధవారం డిమాండ్‌ చేశారు.

హైకోర్టు బెంచను ఏర్పాటు చేయాలి
బార్‌ అసోసియేషన కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న న్యాయవాదులు

బార్‌ అసోసియేషన అధ్యక్షుడు బి. చంద్రుడు

న్యాయవాదుల నిరసన

కర్నూలు లీగల్‌, జూన 24 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో హైకోర్టు బెంచను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఏర్పాటు చేయాలని కర్నూలు బార్‌ అసోసియేషన అధ్యక్షులు బి. చంద్రుడు బుధవారం డిమాండ్‌ చేశారు. పత్తికొండలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా న్యాయవాదుల బృందం కలిసేం దుకు అనుమతుల నిరాకరణపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక బార్‌ అసోసియేషన కార్యాలయం వద్ద నిరసన కార్య క్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయినప్పటికీ ఇంత వరకు కర్నూలులో హైకోర్టు బెంచ ఏర్పాటుకు ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం అన్యాయమన్నారు. రాజకీయాలు, పరిపాలనలో పరిపక్వత కలిగిన ముఖ్యమంత్రి న్యాయవాదులకు న్యాయం చేయడంలో ఆల స్యం చేయడం పట్ల న్యాయవాదులు ఆగ్రహంతో ఉన్నారని తెలిపా రు. కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాదులు కే. ఓంకార్‌, ఎస్‌. రాజేష్‌ బాబు, ఎన.సుబ్బయ్య, కృష్ణమూర్తి, నిత్యజీవరాజు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 12:28 AM