మహిమాన్విత క్షేత్రం.. సిద్ధవటం
ABN , Publish Date - Aug 31 , 2026 | 11:28 PM
శ్రీశైల క్షేత్రానికి దక్షిణ ద్వారంగా విరాజిల్లుతూ అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం సిద్ధవటం అని శ్రీశైలం దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ పోతుగుంట రమే్‌షనాయుడు అన్నారు.
శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ రమే్‌షనాయుడు
శ్రీశైలం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రానికి దక్షిణ ద్వారంగా విరాజిల్లుతూ అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం సిద్ధవటం అని శ్రీశైలం దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ పోతుగుంట రమే్‌షనాయుడు అన్నారు. సోమవారం ఈవో శ్రీనివాసరావుతో కలిసి శ్రీకామాక్షి సమేత సిద్ధవటేశ్వర స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు చేశారు. జ్యోతి సిద్ధవటేశ్వర క్షేత్రంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠను నిర్వహించారు. మూడురోజులుగా శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో రుత్వికులు వేదపారాయణాలు, జపాలు ప్రత్యేక పూజలు శాంతి కార్యక్రమాల తరువాత ఆగమ శాస్త్రానుసారం నిర్ణయించిన ముహూర్తాన నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన వైభవంగా జరిగిందన్నారు. కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థాన ట్రస్ట్‌బోర్డు సభ్యులు చిట్టిబొట్ల భరద్వాజశర్మ, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు. సిద్ధ్దవటం-జ్యోతి ఆలయాలను దశల వారీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు రమే్‌షనాయుడు తెలిపారు.