Share News

రెండు చుక్కలతో నిండు జీవితం

ABN , Publish Date - Jun 28 , 2026 | 11:33 PM

రెండు పోలియో చుక్కలు వేయించడం వల్ల నిండు జీవితానికి రక్షనిస్తుందని జేసీ నూరుల్‌ ఖమర్‌ పే ర్కొన్నారు.

రెండు చుక్కలతో నిండు జీవితం
చిన్నారికి పోలియో చుక్కలు వేస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌

పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి

జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌

కర్నూలు హాస్పిటల్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): రెండు పోలియో చుక్కలు వేయించడం వల్ల నిండు జీవితానికి రక్షనిస్తుందని జేసీ నూరుల్‌ ఖమర్‌ పే ర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఏ. క్యాంపు ఇందిరాగాంధీ స్మారక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసి న పల్స్‌పోలియో కేంద్రంలో చిన్నారులకు జేసీ పోలియో చుక్కలు వేశారు. ఆయన మాట్లాడుతూ రెండు పోలియో చుక్కలు వేసి చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బా టలు వేద్దామన్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలి యో చుక్కలు వేయించి నిండు జీవితాన్ని అందివ్వడం మనందరి బాధ్యత అన్నారు. పల్స్‌ పోలియోలో వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని, జిల్లాలో 1,630 బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణం లో ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి బస్టాండ్లు, రైల్వేస్టేషన్‌లో, ఎయిర్‌పోర్టులో 52పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు 29, 30తేదీల్లో ఇంటింటికి వెళ్లి వైద్యబృందాలు చుక్కలు వేస్తారన్నారు. డీఎంహెచ్‌వో డా.ఎల్‌. భాస్కర్‌, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డా. ఉమాదేవి, కార్పొరేటర్‌ పద్మలత, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డా. రఘు, డెమో ప్రకా్‌షరాజ్‌, హై స్కూల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

79 శాతం పల్స్‌ పోలియో

జిల్లాలో పల్స్‌ పోలియో 79 శాతం నమోదైందని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డా.ఉమ వెల్లడించారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్న పిల్లలు 3,52,164 మం ది ఉన్నారని, మొదటి రోజు 1630 బూత్‌లలో 2,57,150 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. ఈ నెల 28వ తేదీ పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలకు ఈ నెల 29, 30 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటా సందర్శన చేసి మిగిలిన 21 శాతంను పూర్తి చేస్తారన్నారు. ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది పల్స్‌ పోలియో 79 శాతంగా తక్కువగా నమోదు కావడంపై ప్రచార లోపం స్పష్టంగా కనబడుతోంది. ప్రతి ఏడాది మొదటిరోజు 90 శాతంగా పల్స్‌ పోలి యో పర్సంటేజీ నమోదయ్యేది. కేవలం 79శాతం మాత్రమే నమోదు కావడంపై జిల్లా ఇమ్యూనైజేషన్‌, వైద్య ఆరోగ్య, జిల్లా మాస్‌ మీడియా శాఖ సమన్వయ లోపం, అవగాహన లేమి నిర్లక్ష్యం పర్సంటేజీ బాగా తగ్గిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు డిజిటల్‌ ప్రచారం ఎక్కడ ఉందో అధికారులే సమాధానం చెప్పాలి.

Updated Date - Jun 28 , 2026 | 11:34 PM