Share News

దరఖాస్తుల వెల్లువ

ABN , Publish Date - Sep 10 , 2026 | 11:17 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పింఛన్లు కోసం దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి.

దరఖాస్తుల వెల్లువ
దరఖాస్తులు స్వీకరిస్తున్న పీడీ శ్రీధర్‌రెడ్డి

కొత్త పింఛన్ల కోసం ఇప్పటి వరకు 1000 అప్లికేషన్లు

నంద్యాల టౌన్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పింఛన్లు కోసం దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. మూడు రోజుల నుంచి సుమారుగా 1000 అప్లికేషన్లు వచ్చాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ నెల 16 వ తేదీ వరకు గడువు ఉండడంతో వేలల్లో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు సెలవులు వచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మ్యాపింగ్‌ సరిగా లేక..

ఆన్‌లైన్‌లో మ్యాపింగ్‌, రేషనుకార్డు స్పిట్‌ (విభజన) సరిగా లేకపోవడంతో కొందరి దరఖాస్తులు తిరస్కరణకు గురి అవుతున్నాయి. అలాంటి వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆదాయం లేకపోవడం, వయస్సు రీత్యా పింఛన్‌కు అవకాశం ఉన్నప్పటికి వారి కుటుంబంలో ఎవరో ఒకరు ఉద్యోగం చేయడం, వారి పేర్లు రేషన్‌కార్డులో ఉండడంతో ధరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇప్పటికిప్పుడు మార్పులు చేయడానికి అవకాశం లేకపోవడంతో అలాంటి వారు నిరాశగా వెనుదిరిగి వెళ్తున్నారు.

సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు

జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు కార్యాలయాల్లో పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. మొదటి రోజు మాత్రమే కొంతవరకు కొన్ని వాటిల్లో ఇబ్బంది కలిగింది. వాటిని వెంటనే సరిచేశాం. దరఖాస్తుల స్వీకరణకు కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పా ట్లు చేశాం.

శ్రీధర్‌రెడ్డి, పీడీ, డీఆర్‌డీఏ, నంద్యాల

Updated Date - Sep 10 , 2026 | 11:17 PM