ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:31 AM
ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేయాలని విశ్వ విద్యార్థి సేన వ్యవస్థాపక అఽధ్యక్షుడు ఆనంద్‌బాబు డిమాండ్ చేశారు.
కలెక్టర్‌కు విద్యార్థి సంఘాల నాయకుల వినతి
కర్నూలు కలెక్టరేట్/అర్బన్, జూన్ 8(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేయాలని విశ్వ విద్యార్థి సేన వ్యవస్థాపక అఽధ్యక్షుడు ఆనంద్‌బాబు డిమాండ్ చేశారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ డా.ఏసిరిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రవికు మార్, బీసీ రిజర్వేషన హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు బత్తుల లక్ష్మీ కాంతయ్య, మహిళా సంఘం నాయకురాలు చంద్రికమ్మ, ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన నాయకులు సర్వేశ్ బాబు, రాఘవేంద్ర రాజు పాల్గొన్నారు.
స్కూల్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి: స్థానిక బండిమెట్టలోని పొట్టి శ్రీరాములు మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ భవన నిర్మా ణాన్ని పూర్తి చేయాలని ఆర్‌వీపీఎస్ రాష్ట్ర అఽధ్యక్షుడు రవికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌ను రాయ లసీమ విద్యార్థి పోరాట కమిటీ, ఏపీఎస్‌ఎఫ్ జిల్లా అఽధ్యక్షుడు ఎద్దుపెంట అంజీ, రాయలసీమ యువ విద్యార్థి ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రంగ ముని నాయుడులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మూడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు నిర్మాణాలు పూర్తి కావడం లేదని, విద్యార్థులు చాలీచాలనీ గదులతో ఇబ్బందులు పడుతున్నా రన్నారు. కార్యక్రమంలో నాయకులు సురేంద్ర, శేఖర్, రాహుల్ పాల్గొన్నారు.
ఫ రేషన కార్డులో ఎలాంటి అనుమతులు లేకుండా పేరు తొలగిం చినం దుకు మద్దూరునగర్ సచివాలయంలో పని చేస్తున్న వీఆర్వో అరవింద్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ రామానాయుడు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ సిరికి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ తాను నివసిస్తున్న విఠల్‌నగర్ సచివాలయం పరిధిలోని కాకుండా నిబంధనలకు విరుద్ధంగా మద్దూరునగర్ సచి వాలయానికి చెందిన వీఆర్వో నా అనుమతి లేకుండా మా ఫ్యామిలీ రేషన కార్డులో నా పేరు తొలగించారు. కాబట్టి ఆ వీఆర్వో అరవింద్‌ను సస్పెండ్ చేయాలని కోరారు.