Share News

ఓటరు జాబితా ప్రక్షాళనలో ‘సర్‌’ కీలక దశ

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:38 PM

కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్‌ ప్రక్రియ ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక దశ అని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి(ఈఆర్వో), నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు అన్నారు.

ఓటరు జాబితా ప్రక్షాళనలో ‘సర్‌’ కీలక దశ
సర్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న ఈఆర్‌వో, కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు ఈఆర్‌వో, కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, జూలై 4(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్‌ ప్రక్రియ ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక దశ అని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి(ఈఆర్వో), నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు అన్నారు. శనివారం ఆయన కుమ్మరిగేరి, చత్రిబాగ్‌, రాంబోట్ల గుడి, అశోక్‌నగర్‌ పోలింగ్‌ బూత్‌ల పరిధిలో సర్‌ ఎన్యూమ రేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లు, అదనపు ఏఈఆర్‌వోలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. కమిషనర్‌ మా ట్లాడుతూ జూలై 14తో ఎన్యూమరేషన్‌ దశ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా తమ ఎన్యూమరేషన్‌ ఫారాలను త్వరగా సమర్పించాలని సూచించారు. ఫారాలు అందకపో యినా, సమర్పించడంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నా సంబంధిత బీఎల్వోలను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు రాజు, తిప్పన్న, నూర్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 11:38 PM