స్వచ్ఛాంధ్రప్రదేశ్‌యే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Aug 22 , 2026 | 11:46 PM
రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి న్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
అధికారులు, విద్యార్థులతో ‘స్వచ్ఛాంధ్ర’ ప్రతిజ్ఞ
బనగానపల్లె, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి న్నారు. బనగానపల్లె పట్టణంలోని జీఎం టాకీస్ వద్ద మూడో శనివారం సందర్భంగా ‘స్వర్ణాం ధ్ర- స్వచ్ఛాంధ్ర’లో ముఖ్యఅతిథిగా మంత్రి బీసీ పాల్గొన్నారు. జీఎం టాకీస్ స మీపంలో మంత్రి స్వయంగా ఎక్స్‌కవేటర్ నడిపి కాల్వలోని చెత్తచెదారాన్ని, ముళ్లకంపలను తొలగించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ ఇళ్లలో చెత్తను చెత్తబుట్టలో వేసే విధంగా తల్లిదండ్రులకు, గ్రామస్థులకు అవగాహన కల్పించాలన్నారు. బనగానపల్లెని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. విద్యార్థులు, అఽధికారులతో మంత్రి ‘స్వచ్ఛాంధ్ర’ ప్రతిజ్ఞ చేయించారు. జీఎం టాకీస్ నుంచి పెట్రోల్‌బంకు వరకు జరిగిన ర్యాలీలో మంత్రి పాల్గొని స్వచ్చాంధ్ర, స్వర్ణాంధ్ర నినాదాలు చేశారు. పంచాయతీరాజ్ డీఈ నాగశ్రీనివాసులు, ఎంఈవో స్వరూప, విద్యుత్ ఏఈ గర్జప్ప, టీడీపీనాయకులు తులసిరెడ్డి, మద్దిలేటిరెడ్డి, బురానుద్దీన్, కాశీంబాబు, అత్తార్ అబ్దుల్‌కలాం, రాయలసీమ సలాం, అల్తాఫ్ హుసేన్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.