క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:06 AM
విద్యార్థులకు క్రీడల కోటా ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కర్నూలు కల్చరల్, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు క్రీడల కోటా ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శనివారం నగరంలోని శంకరాస్ విద్యా కళాశాల క్రీడా మైదానంలో 70వ రాష్ట్రస్థాయి రగ్బీ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ప్రారంభానికి ముఖ్య అతిథిగా గౌరు చరితా రెడ్డి హాజరయ్యారు. నిర్వాహకులు వివిధ జిల్లాల నుంచి పోటీలకు విచ్చేసిన క్రీడాకారులను ఆమెకు పరిచయం చేశారు. ఆమె మాట్లాడుతూ ఈ పోటీలకు ఇంటర్ విద్యార్థులు అన్ని జిల్లాల నుంచి రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పోటీల గౌరవా ధ్యక్షుడు, ఇంటర్ బోర్డు అధికారి లాలప్ప, ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర రగ్బీ అసోసియేషన ప్రధాన కార్యదర్శి రామాంజ నేయులు, పీఈటీల సంఘం ప్రతినిధి సుంకన్న, పోటీల పరిశీలక ుడు గణేశబాబు, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు నాగశేషయ్య, రియాజ్, లోకేశ్వరి పాల్గొన్నారు.