చదవుతోనే ఉజ్వల భవిష్యత్తు
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:35 PM
చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డీఈవో జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చిన్నమల్కాపురం, ధర్మవరం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు.
‘పది’లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించండి
డీఈవో జనార్దన్‌రెడ్డి
డోన్ రూరల్/ బేతంచర్ల, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డీఈవో జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చిన్నమల్కాపురం, ధర్మవరం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. చిన్న మల్కాపురం గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో ఆయన మాట్లాడారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు స్వయాన డీఈవో భోజనాలు వడ్డించారు. కొచ్చెర్వు, గోసానిపల్లె గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలిం చి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. డోన్ పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థులు బాగా చదివి పది పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. డీఈవో వెంట ఎంఈవో ప్రభాకర్ ఉన్నారు. బేతంచెర్ల నగర పంచాయతీ పరిధిలోని బుగ్గాన్‌పల్లె ధరణి కాలనీలో ఉన్న జడ్పీహెచ్‌ఎస్‌ను ఆయన తనిఖీ చేశారు. అధికారులు, ఉపాధ్యాయుల, విద్యార్ధుల హాజరు శాతం రికార్డులను ఆయన పరిశీలించారు. మండల విద్యాధికారులు సోమశేఖర్, అబ్రహంతో పాటు హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు ఉన్నారు.