Share News

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:02 AM

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు
మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత

కర్నూలు స్పోర్ట్స్‌, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. శనివారం డాక్టర్స్‌ కాలనీలో ఏర్పాటు చేసిన ఏసీఈ బ్యాడ్మింటన ఏరియా కోర్టును పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో కలిసి మంత్రి టీజీ భరత ప్రారం భించారు. మంత్రి టీజీ భరత మాట్లాడుతూ నగరంలో ఇంత మంచి బ్యాడ్మింటన కోర్టు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. బ్యాడ్మింటన కోర్టును ఏర్పాటు చేసిన నిర్వహకులు జనార్దన, ఇమాని యేలు, రాజే ష్‌లను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో 26, 32వ వార్డుల కార్పొరేటర్లు రాఘవేంద్ర రెడ్డి, శ్రీధర్‌, ఐటీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్‌ తదితరులు పాల్గొన్నారు.

పతకాలు సాధించడం గర్వకారణం: స్కాట్లాండ్‌లో నిర్వహించిన 12వ కామనవెల్త్‌ కరాటే చాంపియనషిప్‌-2026లో కర్నూలు చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. శనివారం స్థానిక అవుట్‌డోర్‌ స్డేటియంలో నిర్వహించిన అభినందన సభలో ఆయన విజేతలను సత్కరించారు. మంత్రి టీజీ భరత మాట్లాడుతూ కామనవెల్త్‌ కరాటే చాంపియన షిప్‌లో భారతదేశం మొత్తం 23 పతకాలు సాధించగా.. అందులో ఆంధ్రప్రదేవ్‌కు మూడు పతకాలు లభించాయనీ ఇందులోనూ కర్నూలు చెందిన హేమంతకుమార్‌ రెడ్డి గోల్డ్‌ మెడల్‌ సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. అలాగే మరో క్రీడాకారుడు దినేష్‌ బ్రౌంజ్‌ మెడల్‌ సాధించారన్నారు. అనంతరం కరాటే కోచ పి.జగ దీష్‌ కుమా ర్‌ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గాజుల విజయభాస్కర్‌ రెడ్డి, సురేంద్ర, కరాటే మాస్టర్స్‌ హరీష్‌, గౌస్‌ బాషా, రమణ, ఫయాజ్‌, మునాఫ్‌, రాంబాబు, సురేంద్ర, చిన్న పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 12:02 AM