ఎస్సీ, ఎస్టీలకు వరం.. ‘పీఎం సూర్యఘర్’
ABN , Publish Date - Apr 19 , 2026 | 11:31 PM
పీఎం సూర్యఘర్ పథకం ఎస్సీ, ఎస్టీలకు వరం లాంటిదని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
బనగానపల్లె, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): పీఎం సూర్యఘర్ పథకం ఎస్సీ, ఎస్టీలకు వరం లాంటిదని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బనగానపల్లెలోని పంచమపేటలో పీఎం సూర్యఘర్ ఉత్సవ్ పథకం శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. సోలార్ ప్లేట్‌స్విచ్ నొక్కి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు వందశాతం సబ్సిడీతో పీఎ.సూర్యఘర్ పథకం అమలు చేస్తోందన్నారు. ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకు రాగలిగే ఈపథకం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా కోటి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన గృహాలకు విద్యుత్ అందించేందుకు ఈపథకం అమలు చేస్తోందన్నారు. ఈపథకం ద్వారా నెలకు 300యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఈఈ భరణి, డోన్ విద్యుత్ ఈఈ కమలాకర్, నంద్యాల ఈఈ శ్రీనివాసరెడ్డి, ఏఈలు శ్రీనివాసులు, గర్జప్ప, లైన్ ఇన్‌స్పెక్టర్ షబ్బీర్, తహసీల్దారు రాజీవ్‌రెడ్డి, ఎంపీడీవో నాగరాజు, ఎంఈవో స్వరూప, ఏఈ సాయికృష్ణ, పీఆర్ డీఈ నాగశ్రీనివాసులు, టీడీపీ నాయ కులు బురానుద్దీన్, టంగుటూరు శ్రీనయ్య, కూరగాయలశేఖర్, వెంకటేశ్ పాల్గొన్నారు.