రైతుల సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:42 AM
రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు
ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ రెడ్డి
పాసు పుస్తకాల పంపిణీ
డోన టౌన, జనవరి 3(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని గూండాల గ్రామంలో తహసీ ల్దార్ రవికుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోట్ల రైతులకు రాజముద్రతో ముద్రించిన కొత్త పాసు పుస్తకాల పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జగన ఫోటోతో పాటు ముద్రించబడిన పాత పాసు పుస్తకాల్లో అనేక సాంకేతిక లోపాలు ఉండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ సరిదిద్దుతూ ఇప్పుడు పూర్తిగా పారదర్శకమైన విధానంలో నూతన పాసు పుస్తకాలను రూపొందించామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో కేపీ నరసిం హులు, ఆలంకొండ గిడ్డారెడ్డి, ఆలంకొండ గిరిప్రసాద్ రెడ్డి, గూండాల నారాయణ స్వామి, శ్రీను, వీఆర్వో గోవిందు పాల్గొన్నారు.
శిరివెళ్ల: రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని తహసీల్దార్ విజయశ్రీ అన్నారు. మండలంలోని వనికెందిన్నె గ్రామంలో రైతులకు పాస్ పుస్తకా లను ఆమె శనివారం పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు మురళి, రాముడు, సుబ్బరాయుడు, సుబ్బారావు పాల్గొన్నారు.
దొర్నిపాడు: రైతుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ మండల సెక్రెటరీ కొత్తపల్లి సురేంద్ర అన్నారు. శనివారం మండలంలోని కొండాపురం గ్రామంలో తహసీల్దార్ సుభద్ర ఆధ్వర్యం లో పట్టాదాసు పాసుపుస్తకాల కార్యక్రమం నిర్వహించారు. పంచా యతీ కార్యదర్శి ఉసేన, టీడీపీ నాయకులు కొత్తపల్లి సురేంద్ర, పవనకుమార్‌రెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు నాగలింగేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
చాగలమర్రి: రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సింగిల్ విండో అధ్యక్షుడు ఉసేనరెడ్డి, డెయిరీ చైర్మన రమణారెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని ముత్యాలపాడు గ్రామ సచివాలయం వద్ద తహసీల్దార్ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. మాజీ సర్పంచ ఇండ్ల లక్ష్మీరెడ్డి, నీటి సంఘ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, టీడీపీ నాయ కులు బ్రహ్మానందరెడ్డి, హరినాథ్‌రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.