Share News

30 శాతం ఐఆర్‌ ప్రకటించాలి

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:29 PM

ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్‌సీ కమిటీని ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్‌ను ప్రకటించాలని ఫ్యాప్టో జిల్లా శాఖ డిమాండ్‌ చేసింది.

30 శాతం ఐఆర్‌ ప్రకటించాలి
ర్యాలీ నిర్వహిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు

రోడ్డెక్కిన ఉపాధ్యాయులు

కలెక్టరేట్‌ ఎదుట ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్‌సీ కమిటీని ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్‌ను ప్రకటించాలని ఫ్యాప్టో జిల్లా శాఖ డిమాండ్‌ చేసింది. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి రాజ్‌విహార్‌, మెడికల్‌ కాలేజీ, పెద్దాసుపత్రి మీదుగా కలెక్టరేట్‌ వరకు ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ ఎదుట ఏర్పాటుచేసిన ధర్నాలో రాష్ట్ర ఫ్యాప్టో కోచైర్మన్‌, ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకా్‌షరావు, ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ మధుసూదన్‌ రెడ్డి, జనరల్‌ సెక్రటరీ భాస్కర్‌ మాట్లాడుతూ ఎన్డీయే కూటమి అధికారంలోకి రాకముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు చేసిన హామీ మరిచిపో యిందని ఆరోపించారు. ఫ్యాప్టో నాయకత్వంలో అన్నిజిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు రోడ్డెక్కారన్నారు. అధికారంలోకి రాగానే మెరుగైన పీఆర్‌సీ ఇస్తామని, ఇప్పటి వరకు దాని గురించి ప్రస్తావనే లేదన్నారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రవికుమార్‌ మాట్లాడు తూ నాలుగేళ్లకు పైగా ఉపాధ్యాయుల సరెండర్‌ లీవ్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌ మాట్లాడుతూ ఇన్‌సర్వీసు టీచర్లకు టెట్‌ నుంచి మినహా యింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏపీటీఎఫ్‌ (1938) జిల్లా అధ్యక్షుడు ఇస్మాయిల్‌ మా ట్లాడుతూ కారుణ్య నియామకాలు కోసం వందల కుటుంబాలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఉమ్మడి సర్వీసు రూల్స్‌ను అమలులోకి తేకపోవడం వల్ల పాఠశాలల విద్యలో జూనియర్లు కూడా సీనియర్లపై అధికారం చెలాయిస్తున్నారన్నారు. డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు భీమన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ సీపీఎ్‌సను రద్దుచేసి పాత పెన్షన్‌ స్కీమ్‌ను అ మలులోకి తేవాలని డిమాండ్‌ చేశారు. పీఈటీ అసోసియేషన్ల అధ్యక్షుడు లక్ష్మయ్య మా ట్లాడుతూ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్స్‌ నియామకంలో సీనియారిటీని పరిగణనలోకి తీసుకో వడానికి అధికారులు కుంటిసాకులు చెబుతున్నారనీ ఆరోపించారు. నాయకులు కరెకృష్ణ, నవీన్‌ కుమార్‌, ఎస్టీయూ గోకారి, మరియానందం, హుశేన్‌, రమేష్‌, భీమన్న, వెంకట్రాముడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు దివాకర్‌ కలిసి ఫ్యాప్టో నాయకులకు సంఘీభావం తెలిపారు. సీఐటీయూ నాయకులు రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 11:29 PM