Share News

‘పది’లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి

ABN , Publish Date - Nov 12 , 2026 | 11:16 PM

జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సా ధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్‌ ఏ.సిరి ఆదేశించారు.

‘పది’లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ డా.ఏ. సిరి

కలెక్టర్‌ ఏ.సిరి

కర్నూలు ఎడ్యుకేషన్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సా ధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్‌ ఏ.సిరి ఆదేశించారు. గురువారం సునయన ఆడిటోరియంలో కర్నూ లు విద్యా డివిజన్‌ పరిధిలోని పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా రూపొందించిన కార్యాచరణ ప్ర ణాళికపై విద్యా శాఖ మండల అధికారులు, ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లా డుతూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడంతో పాటు బడి మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలన్నారు. గత ఏడాది పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపుతూ నిరంతర అభ్యసనం, స్లిప్‌ టెస్టులు, ప్రత్యేక పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టడం ద్వారా ఉత్తీర్ణత శాతాన్ని పదిశాతం పెంచగలిగామన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి అందుకు తగ్గ బోధన అందించాలని కలెక్టర్‌ సూచించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పాఠశాలలో మౌలిక వసతులపై ధృష్టి సారించాలన్నారు. డీఈవో సుధాకర్‌, సమగ్ర శిక్ష అభియాన్‌ ఏపీసీ లోకరాజు, డిప్యూటీ డీఈవో శ్రీధర్‌బాబు, డివిజన్‌, విద్యాశాఖ అధికారులు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2026 | 11:16 PM