Share News

98.2 శాతం ఆల్‌బెండజోల్‌ మాత్రల పంపిణీ

ABN , Publish Date - Sep 25 , 2026 | 11:09 PM

జిల్లాలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్ధులకు ఆల్‌బెండజోల్‌ మాత్రలు పంపిణీ కార్యక్రమం శుక్రవారం 98.2 శాతం పూర్తి చేసినట్లు రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ దేవసాగర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ శారదా బాయి తెలిపారు.

98.2 శాతం ఆల్‌బెండజోల్‌ మాత్రల పంపిణీ
బాలికకు ఆల్‌బెండజోల్‌ మాత్రలు వేస్తున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ శారదా బాయి

నంద్యాల హాస్పిటల్‌, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్ధులకు ఆల్‌బెండజోల్‌ మాత్రలు పంపిణీ కార్యక్రమం శుక్రవారం 98.2 శాతం పూర్తి చేసినట్లు రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ దేవసాగర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ శారదా బాయి తెలిపారు. జిల్లాలో 1 - 19 సంవత్సరాల వయస్సు గల లబ్ధిదారులు 4,46,400 మంది లక్ష్యంగా కాగా, మొదటి రోజు 4,38,364 మందికి మాత్రలు మింగించినట్లు తెలిపారు. నంద్యాల పట్టణంలోని బైర్‌మల్‌ వీధిలోని ఖాదర్‌బాద్‌ నరసింహరావు మెమోరియల్‌ మున్సిపల్‌ పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భోజనం అనంతరం విద్యార్ధులకు మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ శరీరంలో నులిపురుగులు చేరడం వల్ల రక్తహీనత ఏర్పడుతుందని, ఆకలి మందగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి అనిల్‌ కుమార్‌ రెడ్డి, రాష్ట్ర పరిశీలకులు రమేష్‌, డాక్టర్‌ నీరజ, ప్రధానోపాధ్యాయులు సఫజ్‌, పద్మజ పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 11:09 PM