Share News

శ్రీశైలంలో 847 అడుగుల నీటి నిల్వ

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:25 PM

శ్రీశైల జలాశయంలో నీటి నిల్వ రోజురోజుకూ తగ్గుతోంది. ఎగువ ప్రాజెక్టులలో విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిపివేయడంతో రిజర్వాయర్‌కు వచ్చే నీరు కూడా ఆగిపోయింది.

శ్రీశైలంలో 847 అడుగుల నీటి నిల్వ
శ్రీశైలం రిజర్వాయర్‌లో 847 అడుగులకు చేరిన నీటి నిల్వ

ఆగని టీఎస్‌ జెన్కో విద్యుదుత్పత్తి

శ్రీశైలం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల జలాశయంలో నీటి నిల్వ రోజురోజుకూ తగ్గుతోంది. ఎగువ ప్రాజెక్టులలో విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిపివేయడంతో రిజర్వాయర్‌కు వచ్చే నీరు కూడా ఆగిపోయింది. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో నీటి ప్రవాహం మొదలైనప్పటి నుంచి ఒకటి రెండు రోజులు మినహాయించి ప్రతి రోజు విద్యుదుత్పత్తి కొనసాగిస్తూనే ఉన్నారు. బుధవారం 42,378 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుని దిగువకు విడుదల చేసినట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.60 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 74.97 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నట్లు నమోదయ్యింది.

Updated Date - Oct 07 , 2026 | 11:25 PM