లారీ ఢీకొని 65 గొర్రెల మృతి
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:04 AM
లారీ ఢీకొని 65 గొర్రెలు మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం తుగ్గలి మండలంలో జరిగింది. వివరాలివీ.. గిరిగిట్ల గ్రామానికి చెందిన పక్కీరప్పకు 120 గొర్రెలు ఉన్నాయి
తుగ్గలి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): లారీ ఢీకొని 65 గొర్రెలు మృతి చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం తుగ్గలి మండలంలో జరిగింది. వివరాలివీ.. గిరిగిట్ల గ్రామానికి చెందిన పక్కీరప్పకు 120 గొర్రెలు ఉన్నాయి. ఉదయం 120 గొర్రెలను మేపడానికి గ్రామ సమీపంలోని కొండలు, గుట్టల వద్దకు తీసుకెళ్లారు. తిరిగి సాయంత్రం ఇంటికి తీసుకొస్తుండగా.. గమినికొండ సమీపంలో పత్తికొండ వైపు నుంచి ఎద్దుల లోడుతో వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో 65 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొన్ని గొర్రెలు గాయపడ్డాయి. సుమారు రూ.10 లక్షలు నష్టం వాటిల్లినట్లు పక్కీరప్ప ఆవేదన వ్యక్తం చేశారు. పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్, తుగ్గలి ఎస్‌ఐ నరేష్ పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని లారీని అదుపులోకి తీసుకుని డ్రైవర్‌ను అరెస్టు చేశారు. గొర్రెల యజమాని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గొర్రెలు మృతి చెందడంతో రహదారిపై 2గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొన్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులుఇబ్బందులు పడ్డారు. గొర్రెల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు, గొర్రెల కాపరి, కుటుంబ సభ్యులు కోరారు.