Share News

పుర పోరులో 434 నామినేషన్లు

ABN , Publish Date - Oct 17 , 2026 | 11:23 PM

నగర, మున్సిపల్‌ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. నామినేషన్ల పర్వం శుక్రవారం ప్రారంభమై శనివారం ఊపందుకుంది.

పుర పోరులో 434 నామినేషన్లు

మేయర్‌, చైర్మన్‌ పదవులకు 14

కార్పొరేటర్‌, కౌన్సిలర్లుగా 430

నేటితో ముగియనున్న గడువు

చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం

కర్నూలు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): నగర, మున్సిపల్‌ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. నామినేషన్ల పర్వం శుక్రవారం ప్రారంభమై శనివారం ఊపందుకుంది. తొలి రోజు పెద్దగా ఆశించిన స్థాయిలో అభ్యర్థులు ముందుకు రాకపోయినా, రెండో రోజు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. కర్నూలు నగరం, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీల్లో రెండు రోజుల్లో మేయర్‌, చైర్మన్‌ స్థానాలకు 14, కార్పొరేటర్‌, కౌన్సిలర్‌ స్థానాలకు 430 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల దాఖలు ఘట్టం నేటితో ముగియనుం ది. చివరిరోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు వస్తాయని ఎన్నికల అధికారులు భావిస్తున్నా రు. ఆమేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.సమస్యాత్మక వా ర్డుల్లో ఘర్షణలు జరగకుండా పోలీసులు నిఘా పెంచారు.

ఉరుకులు.. పరుగులు

మేయర్‌, చైర్మన్‌ స్థానాలు సహా పలు వార్డులను ఎస్సీ, బీసీలకు రిజర్వు చేశారు. ఆ స్థానాల్లో రిజర్వు అభ్యర్థులు పోటీ చేయాలంటే కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాల్సిందే. అభ్యర్థుల ఎంపిక శనివారం సాయంత్రం వరకు కూడా పూర్తి కాలేదు. ఎంపికైన అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దారు కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. అలాగే.. చైర్మన్‌, వార్డు కార్పొరేటర్లగా పోటీ చేయదలుకున్న అభ్యర్థులు సంబంధిత కార్పొరేషన్‌, మున్సిపాలిటీలకు ఆస్తి, మంచినీటి కుళాయి ప న్ను సహా మున్సిపాలిటీ దుకాణాలు, ఇతర స్థలాల అద్దె బకాయి ఉండకూడదు. మున్సిపాలిటీలకు బకాయి ఉంటే, వాటిపై ఎవరైనా అభ్యంతరం చెబితే నామినేషన్‌ తిరస్కరించే అవకాశం ఉంది. కర్నూలు నగర పాలక సంస్థలో, మున్సిపాలిటీల్లో బకాయిలు లేవని ‘నో డ్యూస్‌’ సర్టిఫికెట్‌ కోసం ఆఫీసులకు పరుగులు పెడుతున్నారు. బకాయి ఉంటే క్షణాల్లో చెల్లిస్తున్నారు.

నేడే ఆఖరు: పుర పోరులో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ నేటి సాయంత్రం 3 గంటలకు ముగుస్తుంది. చివరి రోజు కావడంతో పెద్దసంఖ్యలో నామినేషన్లు వస్తాయని అధికారులు ఆమేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి ఎందరు అభ్యర్థులు వచ్చినా వారందరి నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తరవాత వచ్చిన వారి నామినేషన్లు తీసుకోరు. దీంతో అభ్యర్థులు సాయంత్రం 3 గంటల్లోగా నామినేషన్ల స్వీకరణ కేంద్రంలోకి చేరుకునేలా సన్నాహాలు చేసుకోవాలని అధికారులు విన్నవిస్తున్నారు.

అత్యధికంగా కర్నూలులో 194 నామినేషన్లు

కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో మేయర్‌ స్థానానికి ఏడు నామినేషన్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి సుశీలమ్మ నామినేషన్‌ వేశారు. 68వార్డులకు 187 నా మినేషన్లు వచ్చాయి. టీడీపీ 78, వైసీపీ 64, సీపీఎం 7, సీ పీఐ3, జనసేన14, బీజేజీ7, స్వ తంత్రులు 27మంది ఉన్నారు.

ఆదోని మున్సిపాలిటీలో చైర్‌ప ర్సన్‌కి టీడీపీ అభ్యర్థి నాగమణి శనివారం ఒక సెట్టు నామినేషన్‌ వేశారు. ఆదివారం మరో సెట్టు వేస్తారు. స్వతంత్ర అభ్యర్థిగా స్వప్న నాయకర్‌ నామినేషన్‌ వేశారు. 52 వార్డులకు 133నామినేషన్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థులు 46, వైసీపీ 44, బీజేపీ 19, బీఎ్‌సపీ 7, జనసేన6, స్వతంత్రు లు 13మంది నామినేషన్లు వేశారు.

ఎమ్మిగనూరు మున్సిపల్‌ చైర్మన్‌ స్థానానికి వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ రఘు, స్వతంత్రులు మూడు నామినేషన్లు వేశారు. 44 వార్డులకు 85 నామినేషన్లు రాగా, అందులో టీడీపీ నుంచి 23, వైసీపీ 48, సీపీఎం 2, సీపీఐ ఒకటి, స్వతంత్రులు 15 మంది వేశారు.

గూడూరు నగర పంచాయతీ చైర్మన్‌ స్థానానికి బీజేపీ అభ్యర్థి డమామ్‌ సునీతాబాయి ఒక్కరే నామినేషన్‌ వేశారు. 23 వార్డులకు 25 నామినేషన్లు దాఖలు కాగా, అందులో టీడీపీ అభ్యర్థులు 18, జనసేన ఒకటి, బీజేపీ ఒకటి, స్వతంత్రులు 5 నామినేషన్లు దాఖలు చేశారు.

Updated Date - Oct 17 , 2026 | 11:24 PM