Share News

40,921 కేసులు పరిష్కారం

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:42 PM

స్థానిక న్యాయ సేవాసదన్‌ భవన్‌లో శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో 40,921 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి తెలిపారు.

40,921 కేసులు పరిష్కారం
జాతీయ లోక్‌అదాలత్‌లో పాల్గొన్న కక్షిదారులు, న్యాయాధికారులు

జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి

కర్నూలు లీగల్‌, మార్చి 14(ఆంధ్రజ్యోతి): స్థానిక న్యాయ సేవాసదన్‌ భవన్‌లో శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో 40,921 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ధి తెలిపారు. 186 మోటారు యాక్సిడెంట్‌ కేసులలో రూ.12,83,49,000ల నష్టపరిహారాన్ని బాధితులకు నష్టపరిహారంగా బీమా కంపెనీల నుంచి చెల్లించినట్లు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు భూసేకరణలో నష్టపోయిన 190 మంది రైతుల వారసులకు రూ.83,29,124ల నష్టపరిహారాన్ని ప్రభుత్వం నుంచి ఇప్పించామన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన 25 బెంచీల ద్వారా 689 సివిల్‌ కేసులు, 40,232 క్రిమినల్‌ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. మొదటి అదనపు జిల్లా న్యాయాధికారులు కమలాదేవి, వాసు, లక్ష్మిరాజ్యం, విశ్రాంత అదనపు జిల్లా న్యాయాధికారి లక్ష్మినరసింహారెడ్డి, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి సరోజనమ్మ, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కిరణ్‌ కుమార్‌, అనూష, కోర్టు మానిటరింగ్‌ సీఐ రామానాయుడు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 11:42 PM