Share News

38 మందికి హెడ్‌ నర్సులుగా పదోన్నతి

ABN , Publish Date - Jan 21 , 2026 | 10:38 PM

వైద్య ఆరోగ్య శాఖ జోనల్‌ పరిధిలో పని చేస్తున్న 38 మంది స్టాఫ్‌ నర్సులకు హెడ్‌ నర్సులుగా పదోన్నతి కౌన్సెలింగ్‌ను బుధవారం కడప రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.రామగిడ్డయ్య నిర్వహించారు.

 38 మందికి హెడ్‌ నర్సులుగా పదోన్నతి
పదోన్నతి పొందిన హెడ్‌ నర్సులతో కడప ఆర్డీ

కర్నూలు హాస్పిటల్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖ జోనల్‌ పరిధిలో పని చేస్తున్న 38 మంది స్టాఫ్‌ నర్సులకు హెడ్‌ నర్సులుగా పదోన్నతి కౌన్సెలింగ్‌ను బుధవారం కడప రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.రామగిడ్డయ్య నిర్వహించారు. కర్నూలు జీజీహెచ్‌లో పనిచేస్తున్న జి.రేణుక, కె.మౌలాలమ్మ, బి.ప్రమీలమ్మ, జె.విజయలక్ష్మి, ఎం.కల్యాణి ఇక్కడే హెడ్‌నర్సులుగా పదోన్నతి పొందారు. జి.వెంకటేశ్వరమ్మ నంద్యాల జీజీహెచ్‌ నుంచి అనంతపురం జీజీహెచ్‌కు, కె.రంగమ్మ ఆళ్లగడ్డ సీహెచ్‌సీ నుంచి కడప జీజీహెచ్‌కు, బి.సుశీల కర్నూలు జీజీహెచ్‌ నుంచి నంద్యాల జీజీహెచ్‌కు పదోన్నతి పొందారు. కర్నూలు జీజీహెచ్‌కు చెందిన రేవతి నాట్‌ విల్లింగ్‌ అని రాసి ఇచ్చారు. పదోన్నతి పొందిన హెడ్‌ నర్సులకు కడప ఆర్డీ ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ గవర్నమెంట్‌ నర్సెస్‌ అసోసియేసన్‌ కర్నూలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.లీలావతి, సి.బంగారి, ఉపాధ్యక్షురాలు జి.శాంతిభవాని, కోశాధికారి ఎన్‌.లక్ష్మీనరసమ్మ పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 10:38 PM