Share News

లోక్‌ అదాలత్‌లో 3,497 కేసుల పరిష్కారం

ABN , Publish Date - Sep 13 , 2026 | 12:02 AM

పట్టణంలోని కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ ఆదాలత్‌లో 3,497 కేసులు పరిష్కారం అయినట్లు అయిదో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్నరాజా తెలిపారు.

లోక్‌ అదాలత్‌లో 3,497 కేసుల పరిష్కారం
కోవెలకుంట్లలో కేసులను పరిశీలిస్తున్న న్యాయాధికారి మంజుల

ఆళ్లగడ్డ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ ఆదాలత్‌లో 3,497 కేసులు పరిష్కారం అయినట్లు అయిదో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్నరాజా తెలిపారు. కోర్టు ఆవరణంలో మూడు బెంచ్‌ లను ఏర్పాటు చేశామని, ఆళ్లగడ్డ సీనియర్‌ కోర్టుకు సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శైలజ, జూనియర్‌ కోర్టుకు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి భాస్కర్‌ల ఆధ్వర్యంలో రెండు బెంబ్‌ లను ఏర్పాటు చేశామన్నారు. 20 మోటార్‌ వెకిల్‌ కేసులను పరిష్కరించి నష్టపరిహారం కింద బాదితులకు రూ.96,81,000 ఇప్పించామన్నారు. ఈపి-3, ఐఏ-1, ఎస్టీసీ-3,337 తదితర కేసులను పరిష్కరించామన్నారు. సెకెండ్‌ క్లాస్‌ న్యాయాధికారి రవికుమార్‌, బెంచ్‌ సభ్యులు విజయ్‌, శివప్రసాద్‌ రావు, బాబాఫకురుద్దీన్‌, ఏపీపీ సుబ్బయ్య, ప్రతాప్‌, బార్‌ అఽధ్యక్షుడు శివరామిరెడ్డి, ఏపిజి బాలగుర్రెరెడ్డి పాల్గొన్నారు.

2,655 కేసుల పరిష్కారం

బనగానపల్లె: మెగా లోక్‌ అదాలత్‌లో 2655 కేసులు పరిష్కరించినట్లు న్యాయాధికారి ప్రతిమ తెలిపారు. బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల మండలాల పరిధిలో పరిష్కామయ్యాని తెలిపారు.

1,024 కేసుల పరిష్కారం

కోవెలకుంట్ల: మెగా లోక్‌ అదాలత్‌లో 1,024 కేసులను పరిష్కరించినట్లు బార్‌ అసోసియేషన్‌ అఽధ్యక్షుడు తిరుపాల్‌ తెలిపారు. శనివారం జూనియర్‌ సివిల్‌ కోర్డు ఆవరణలో న్యాయాధికారి మంజుల అధ్యక్షతన నిర్వహించామన్నారు. ఎక్సైజ్‌ కేసులు 23, ఓఎస్‌- 14, జీపీ-2, ఎంసీ-1, డీవీసీ-1, సీసీ-24, సమ్మరీ టైల్‌ కీన్‌ ఎస్‌టీసీ-980కేసులు పరిష్కారయ్యాయన్నారు. నరసింహుడు, శ్రీనివాసులు, రమే ష్‌, ఓబులేస్‌, రాజశేఖర్‌, కంబగిరి ఉన్నారు.

Updated Date - Sep 13 , 2026 | 12:02 AM