భారీ చోరీ
ABN , Publish Date - Jun 21 , 2026 | 12:15 AM
పట్టణ సమీపంలో ఉన్న జాతీయ రహదారి పక్కన ఉన్న భారత్ డాబా వద్ద మీనా ప్రైవేటు ట్రావెల్స్‌లో భారీ చోరీ జరిగింది.
డోన్‌లో 2.75 కిలోల బంగారం అపహరణ
డోన్ టౌన్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): పట్టణ సమీపంలో ఉన్న జాతీయ రహదారి పక్కన ఉన్న భారత్ డాబా వద్ద మీనా ప్రైవేటు ట్రావెల్స్‌లో భారీ చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. మోతీలాల్ అనే వ్యాపారి మీనా ట్రావెల్స్ బస్సులో అనంతపురం నుంచి హైదరాబాదుకు బయలుదేరారు. డోన్ హైవేలో భారత్ డాబా వద్ద భోజన విరామ సమయంలో బస్సు నిలిపారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో జడ్చర్ల వద్ద తన వద్దనున్న 2.75 కిలోల బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు మోతీలాల్ గుర్తించారు. శనివారం బాధితుడు మోతీలాల్ డోన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ చోరీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.