Share News

2,73,587 ఓట్లు రద్దు..!

ABN , Publish Date - Jul 31 , 2026 | 11:34 PM

‘ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌)’ ప్రక్రియ ముగిసింది. ముసాయిదా ఓటర్ల జాబితాను శుక్రవారం కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. సిరి విడుదల చేశారు.

2,73,587 ఓట్లు రద్దు..!

జిల్లాలో మిగిలిన ఓటర్లు 18,12,532

ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

ఈ నెల 30 వరకు అభ్యంతరాల స్వీకరణ

అక్టోబరు 3న తుది జాబితా

‘ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌)’ ప్రక్రియ ముగిసింది. ముసాయిదా ఓటర్ల జాబితాను శుక్రవారం కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. సిరి విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం జిల్లాలో గుర్తించిన ఓటర్లు 18,12,532. సర్‌ ప్రారంభానికి ముందు ఉన్న ఓటర్లు 20,86,119. మరణించిన, డూప్లికేట్‌, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, అడ్రస్‌లు దొరకని ఓటర్లు 2,73,587 మంది ఉన్నారు. అంటే.. వీరి ఓటు హక్కు రద్దు అయినట్లేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే.. ముసాయిదా ఓటర్ల జాబితాలో ఎవరి పేరైనా లేకుంటే అధారాలతో ఈ నెల 30 వరకు దరఖాస్తు, అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. వాటిని సెప్టెంబరు 28లోగా పరిష్కరిస్తారు. అక్టోబరు 3న తుది జాబితా విడుదల చేస్తారు. 2.73 లక్షల ఓట్లు రద్దు అయితే నియోజకవర్గాల పునర్విభజనపై ఆ ప్రభావం పడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రద్దు జాబితాలో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉండడం గమనార్హం.

కర్నూలు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ‘ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌)’ ప్రక్రియ ప్రారంభించే నాటికి జిల్లాలో 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో 2,203 పోలింగ్‌ స్టేషన్లు (బూత్‌)లు పరిధిలో జూన్‌ 12 నుంచి బీఎల్‌ఓలు, కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బీఎల్‌ఏ సహకారంతో సర్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జూలై 14న సర్‌ ముగియాల్సి ఉంటే.. వివిధ రాజకీయ పార్టీ విన్నపాలు, రాష్ట్ర ఎన్నికల సంఘం విజ్ఞప్తి మేరకు 24వ తేది వరకు పొడిగించారు. 20,86,119 ఓటర్లకు (100 శాతం) ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేయడంతో పాటు డిజిటలైజేషన్‌ కూడా వంద శాతం పూర్తి చేశారు. సర్‌ ప్రక్రియ ముగిసే నాటికి బీఎల్‌వోలకు తిరిగి వచ్చిన ఫారాలు కేవలం 18,12,532 మాత్రమే. సర్‌ ప్రక్రియకు ముందు జిల్లాలో పురుషులు 10,28,794 మంది, మహిళలు 10,56,757 మంది, ఇతరులు 568 మంది ఓటర్లు ఉన్నారు. సర్‌ ప్రక్రియ తరువాత పురుష ఓటర్లు 8,93,162, మహిళా ఓటర్లు 9,19,105 మంది, ఇతర ఓటర్లు 265 మంది ఉన్నారు. ఈ లెక్కన జిల్లాలో పురుషుల ఓట్లు 1,35,632, మహిళా ఓట్లు 1,37,652, ఇతర ఓట్లు 303 తొలగించే జాబితాలో ఉన్నాయి. అంటే.. పురుషులతో పోలిస్తే.. రద్దు జాబితాలో 2,020 మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.

కర్నూలు అత్యధికం.. మంత్రాలయం అత్యల్పం..

మరణించిన (డెత్‌), అడ్రస్‌లు దొరకని/అబ్సెంట్‌ అయిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన (పర్మనెంట్‌ సిఫ్టెడ్‌), నకిలీ (డూప్లికేట్‌) విభాగాల్లో అత్యధికంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో 67,755 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సర్‌కు ముందు 2,74,622 మంది ఓటర్లు ఉంటే, తరువాత 2,06,867 ఓటర్లకు తగ్గిపోయింది. ఈ తరువాత స్థానంలో పాణ్యం నియోజకర్గం ఉంది. ఈ నియోజకవర్గంలో 51,985 ఓట్లు రద్దు జాబితాలో ఉన్నాయి. 3,35,015 ఓటర్లు ఉంటే 2,83,030 ఓటర్లకు తగ్గిపోయింది. ఆదోని నియోజకవర్గంలో 31,505 ఓట్లు తొలగించే జాబితాలో చేరాయి. ఈ నియోజకవర్గంలో సర్‌కు ముందు 2,637,980 ఓట్లు ఉంటే, తరువాత 2,33,034 ఓట్లకు తగ్గిపోయింది. అత్యల్పంగా మంత్రాలయం నియోజకవర్గంలో 15,689 ఓట్లు తొలగించే అవకాశం ఉంది. సర్‌ ముందుకు 2,12,841 ఓట్లు ఉంటే తరువాత 1,97,152 ఓటర్లకు తగ్గిపోయింది. పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల్లో సగటున 20 వేల నుంచి 26 వేల వరకు రద్దు జాబితాలో ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో సర్‌ ముందు 2.15 లక్షల నుంచి 2.63 లక్షల వరకు ఓటర్లు ఉంటే, ఆ తరువాత 2.26 లక్షల నుంచి 2.37 లక్షలకు తగ్గిపోయింది.

నియోజకవర్గాల పునర్విభజనపై ప్రభావం

సర్‌ ప్రక్రియ తరువాత 2.73 లక్షల ఓటర్లను వివిధ కారణాలు వల్ల తొలగించే జాబితాలో చేర్చారు. ఇది నియోజకవర్గాల పునర్విభజనపై తీవ్ర ప్రభావం చూపే అకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం పొంది ప్రక్రియకు శ్రీకారం చుడితే, ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సంఖ్యలో 50 శాతం అదనంగా పెరుగుతాయని, ఒక్కో నియోజకవర్గంలో 1.50-1.60 లక్షలతో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంచనా. జిల్లాలో పాణ్యంతో కలిపి సర్‌కు ముందు 20,86,119 ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన అదనంగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా ఏర్పడే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 18,12,582కు పడిపోయింది. ఈ జాబితాను పరిగణలోకి తీసుకుంటే మూడు నియోజకవర్గాలకు మించి పెరిగే అవకాశం లేదని అంటున్నారు.

సర్‌కు ముందు, తరువాత నియోజకవర్గాల వారీగా ఓటర్లు, తగ్గిన ఓటర్ల వివరాలు

నియోజకవర్గం ముందు తరువాత తగ్గిన ఓటర్లు

కర్నూలు 2,74,622 2,06,867 67,755

పాణ్యం 3,35,015 2,83,030 51,985

పత్తికొండ 2,26,970 2,06,859 20,111

కోడుమూరు 2,51,496 2,26,576 24,920

ఎమ్మిగనూరు 2,53,206 2,21,701 31,505

మంత్రాలయం 2,12,841 1,97,152 15,689

ఆదోని 2,67,980 2,33,034 34,946

ఆలూరు 2,63,989 2,37,313 26,676

మొత్తం 20,86,119 18,12,532 2,73,587

నియోజకవర్గాల వారీగా డెత్‌, గుర్తించని/ఆబ్సెంట్‌, పర్మినెంట్‌ షిఫ్టెడ్‌, డూప్లికేట్‌ ఓటర్ల వివరాలు

నియోజకవర్గం డెత్‌ గుర్తించని/ పర్మనెంట్‌ ఇతర డూప్లికేట్‌ మొత్తం

ఆబ్సెంట్‌ షిఫ్టెడ్‌ ఓటర్లు ఓటర్లు ఓటర్లు

కర్నూలు 6,274 21,210 28,594 228 11,449 67,755

పాణ్యం 9,279 15,325 15,065 119 12,197 51.985

పత్తికొండ 7,069 1,568 5,665 429 5,380 20,111

కోడుమూరు 10,168 2,682 6,195 27 5,848 24,920

ఎమ్మిగనూరు 6,735 11,222 6,544 1 7,003 31,505

మంత్రాలయం 6,929 941 2,837 5 4,977 17,689

ఆదోని 8,264 14,228 3,933 17 8,444 34,946

ఆలూరు 10,640 3,365 7,178 23 5,470 26,676

మొత్తం 65,358 70,601 76,011 848 60,768 2,73,587

సర్‌ తరువాత నియోజకవర్గాల వారీగా పురుషులు, మహిళలు, ఇతర ఓటర్లు

నియోజకవర్గం పోలింగ్‌ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

కేంద్రాలు

కర్నూలు 318 99,820 1,07,029 18 2,06,867

పాణ్యం 373 1,37,835 1,45,132 63 2,83,030

పత్తికొండ 277 1,03,259 1,03,578 22 2,06,859

కోడుమూరు 291 1,12,792 1,13,772 12 2,26,576

ఎమ్మిగనూరు 322 1,09,503 1,12,167 31 2,21,701

మంత్రాలయం 267 96,405 1,00,719 28 1,97,152

ఆదోని 284 1,14,540 1,18,449 45 2,33,034

ఆలూరు 320 1,19,008 1,18,259 46 2,37,313

మొత్తం 2,452 8,93,162 9,19,105 265 18,12,532

Updated Date - Jul 31 , 2026 | 11:34 PM