రాష్ట్రానికి 25 శాతం పెట్టుబడులు
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:20 AM
దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం రాష్ట్రానికి వస్తున్నాయని.. సీఎం చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే ఇది సాధ్యమైందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
సీఎం చంద్రబాబుపై నమ్మకంతోనే సాధ్యం
బస్ వరల్డ్ ఇండియా క్లాస్‌లో మంత్రి టీజీ భరత్
కర్నూలు అర్బన్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం రాష్ట్రానికి వస్తున్నాయని.. సీఎం చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే ఇది సాధ్యమైందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. మంగళవారం డిల్లీలో బస్ వరల్డ్ ఇండియా కాన్‌క్లేవ్ 2026 కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ నితిన్ గడ్కరీతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. ఫోర్స్ గణాంకాల ప్రకారం దేశం మొత్తం ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ 25 శాతానికి పైగా వాటా ఉందని వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ రవాణాకు ప్రపంచ కేంద్రంగా భారత్ మారుతోందని, ఇందులో ఏపీ కీలకం కానుందన్నారు. ఇప్పటికే కియా, ఇండియా, ఇసుజు మోటర్స్ ఇండియా కంపెనీల ఏపీలో ఉన్నాయని, ఇప్పడు ఎలక్ర్టిక్ మొబిలిటీ, బ్యాటరీ తయారీ రంగాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఏపీ ఈవీ పాలసీ 4.0 పారిశ్రామికవేత్తలను ఎంతో ఆకర్షిస్తోందన్నారు. ఎలక్ర్టానిక్ వెహికల్స్ వినియోగానికి ఏపీ మద్దతిస్తోందన్నారు.