శ్రీశైలంలో 2.5 లక్షల మంది భక్తులు
ABN , Publish Date - Feb 16 , 2026 | 01:05 AM
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆదివారం క్షేత్రంలో సుమారు రెండున్న లక్షల మంది భక్తులు వచ్చారని కలెక్టర్ రాజకుమారి వెల్లడించారు.
శ్రీశైలం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆదివారం క్షేత్రంలో సుమారు రెండున్న లక్షల మంది భక్తులు వచ్చారని కలెక్టర్ రాజకుమారి వెల్లడించారు. లక్షన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని చేసిన ఏర్పాట్లకు భిన్నంగా భక్తులు క్షేత్రానికి చేరుకోవడంతో అధికారులకు పర్యవేక్షణ కొంత కష్టతరమైనప్పటికీ తగినన్ని సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు. స్వామి, అమ్మవార్లను భక్తులందరూ దర్శించుకొనే ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీకి వెళ్లి క్యూలైన్లల్లో భక్తులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. పాగాలంకరణకు శివస్వాములతోపాటు సామాన్య భక్తులకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. వీఐపీలకు కూడా ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.