కొత్తగా 215 మంది హౌస్ సర్జన్లు
ABN , Publish Date - May 28 , 2026 | 12:24 AM
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 215 మంది కొత్తగా హౌస్ సర్జన్లు విధుల్లో చేరారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు పరీక్షలు ఆలస్యం కావడంతో హౌస్ సర్జన్లు పట్టాలు తీసుకుని వెళ్లడంతో రెండు నెలలుగా కొత్త హౌస్ సర్జన్లు విధుల్లో చేరలేదు.
కర్నూలు హాస్పిటల్, మే 27 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 215 మంది కొత్తగా హౌస్ సర్జన్లు విధుల్లో చేరారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు పరీక్షలు ఆలస్యం కావడంతో హౌస్ సర్జన్లు పట్టాలు తీసుకుని వెళ్లడంతో రెండు నెలలుగా కొత్త హౌస్ సర్జన్లు విధుల్లో చేరలేదు. దీంతో అత్యవసర విభాగాలు, సాధారణ వార్డుల్లో రోగులకు వైద్యం సరిగా అందడం లేదు. పీజీలు, ఇతర వైద్యులతో రెండు నెలలు నెట్టుకొచ్చిన తర్వాత 2021 బ్యాచ్‌కు చెందిన 215 మంది హౌస్ సర్జన్లు జాబితాను మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కే.చిట్టినరసమ్మ విడుదల చేశారు. ఎన్‌ఎంసీ ప్రకారం హాస్పిటల్ సూపరింటెండెంట్ డా.కే. వెంకటేశ్వర్లు వివిధ వార్డుల్లో హౌస్ సర్జన్లకు డ్యూటీలు కేటాయించారు. ఈ మేరకు బుధవారం కార్యాలయంలో కొత్తగా చేరిన హౌస్ సర్జన్లు రిజిస్ర్టేషన్ చేయించుకున్నారు. ప్రతిరోజు 300 నుంచి 400 మంది అత్యవసర రోగులకు, సాధారణ వార్డుల్లో 1000 మంది రోగులకు హౌస్ సర్జన్లు సేవలు అందిస్తుంటారు. మూడు షిఫ్టుల్లో పని చేసే హౌస్ సర్జన్లు వైద్యులకు పీజీలకు సహాయకులుగా పని చేస్తుంటారు.