Share News

వైసీపీ నుంచి టీడీపీలోకి 20 కుటుంబాలు

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:25 AM

మండలంలోని పరమాన్‌దొడ్డి తాండ, ఓం నగర్‌ గ్రామాలకు చెందిన 20 వైసీపీ దళిత కుటుంబాలవారు టీడీపీలోకి చేరారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి 20 కుటుంబాలు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి

మంత్రాలయం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పరమాన్‌దొడ్డి తాండ, ఓం నగర్‌ గ్రామాలకు చెందిన 20 వైసీపీ దళిత కుటుంబాలవారు టీడీపీలోకి చేరారు. సోమవారం మాధవరం గ్రామంలో టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి నివాసంలో పెద్ద ఈరన్న, చిన్న రంగన్న, స్వామి, పులికొండ రంగన్న, సందేశ్‌, అమరేష్‌, యువరాజు, శాంతప్ప, చిన్న ఈరన్న, కృష్ణ, సురేష్‌, పెద్ద ఉచ్చన్నతో పాటు మిగతావారు టీడీపీ భివృద్ది, సంక్షేమం చూసి చేరుతున్నట్లు తెలిపారు. వీరికి రాఘవేంద్రరెడ్డి, రఘునాథరెడ్డి, మంచాల సొసైటీ చైర్మెన్‌ రామకృష్ణరెడ్డి, రాకే్‌షరెడ్డి, రాజారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. కార్యకర్తలకు అండగా ఉంటూ ఏ సమస్య వచ్చినా న్యాయం చేస్తామన్నారు. సీహెచ్‌ చంద్రశేఖర్‌ పురషోత్తం, శంకర్‌నాయక్‌, ఈరన్న కేశన్న, బొజ్జప్ప తదితరులు పాల్గొన్నారు.

నేడు టీడీపీ నియోజకవర్గ సమావేశం

మాధవరం గ్రామంలోని తన నివాసంలో మంగళవారం ఉదయం 10 గంటలకు మంత్రాలయం నియోజకవర్గస్తాయి టీడీపీ సమావశం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ఇన్‌చార్జి ఎన్‌ రాఘవేంద్రరెడ్డి అన్నారు. సోమవారం మాట్లాడుతూ జిల్లా ఇన్‌చార్జి నిమ్మల రామానాయుడు, విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. సింగిల్‌విండో అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్‌ రఘునాథరెడ్డి, బొజ్జప్ప, చాకలి రాఘవేంద్ర, విజయ్‌కుమార్‌, నరసింహులు పాల్గొన్నారు.

Updated Date - Aug 25 , 2026 | 12:25 AM