Share News

జీడీపీలో 1.8 టీఎంసీలు

ABN , Publish Date - Sep 24 , 2026 | 11:22 PM

జిల్లాలో ఎమ్మిగనూరు, డోన్‌, కోడుమూరు, పత్తికొండ ప్రాంతాల రైతుల జీవనాడి అయిన గాజులదిన్నె ప్రాజెక్టు ప్రస్తుతం ఎల్లెల్సీ, హంద్రీ నీవా నీటితో కళకళలాడుతోంది.

జీడీపీలో 1.8 టీఎంసీలు

హంద్రీ నీవా నుంచి రోజుకు 250 క్యూసెక్కుల నీరు

తుంగభద్ర దిగువ కాలువ నుంచి 155 క్యూసెక్కులు

గోనెగండ్ల, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎమ్మిగనూరు, డోన్‌, కోడుమూరు, పత్తికొండ ప్రాంతాల రైతుల జీవనాడి అయిన గాజులదిన్నె ప్రాజెక్టు ప్రస్తుతం ఎల్లెల్సీ, హంద్రీ నీవా నీటితో కళకళలాడుతోంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న అడపదడపా వర్షాల కారణంగా జీడీపీకి రోజూ వరద నీరు వచ్చి చేరుతోంది. అలాగే గత 15 రోజులుగా రోజుకు 250 క్యూసెక్కుల ప్రకారం హంద్రీ నీవా నుంచి జీడీపీకి కృష్టానది నీరు చేరుతోంది. గురువారం ఉదయం ఎల్లెల్సీ నీటిని ఇరిగేషన్‌ అధికారులు గోనెగండ్ల ఎస్కేప్‌ చానల్‌ ద్వారా జీడీపీలోకి 155 క్యూసెక్కులను మళ్లించారు. గోనెగండ్ల సెక్షన్‌కు ఎల్లెల్సీ కింద 180 క్యూసెక్కుల నీరు వస్తోంది. అందులో 155 క్యూసెక్కుల నీటిని జీడీపీకి మళ్లించి మిగతా 25 క్యూసెక్కుల నీటిని కోడుమూరుకు మళ్లించినట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. ఇక జీడీపీలో ప్రస్తుతం 1.8 టీఎంసీల నీరు నిలువ ఉంది. జీడీపీ ప్రస్తుతం నీటి నిలువ సామర్థ్యం 4.5 టీఎంసీలు. అరకొరగ కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన మద్దికెర, తుగ్గలి, పత్తికొండ, రాతన తదితర ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. తెర్నెకల్లు వంక మీదుగా హంద్రీనీవా నీరు గాజులదిన్నె ప్రాజెక్టును చేరుతోంది. ప్రాజెక్టు కింద ఉన్న తాగునీటి పథకాలకు నీటి ఇబ్బంది ఇక ఉండదని అధికారులు భావిస్తున్నారు. బండగట్టు, డోన్‌, క్రిష్టగిరి తాగునీటి పథకాలకు, అవసర సమయంలో కర్నూలు, కోడుమూడు, గూడురు, బెళగల్‌ ప్రాంతాలకు తాగునీటి కోసం ప్రస్తుతం రోజుకు 170 క్కూసెక్కులు మళ్లిస్తున్నారు. ఇక వచ్చే రబీకి నీటి కష్టాలు తీరుతాయని ఆయకట్టు రైతుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కింద 24,500 ఎకరాలు రబీలో సాగు కావాల్సి ఉంది. జీడీపీలోకి వరద నీరు, ఎల్లెల్సీ, హెచ్‌ఎన్‌ఎస్‌ నీరు ఇట్లాగే వచ్చి చేరితే ఈ ఏడాది రబీ ఆయకట్టు భూములకు సాగు నీటికి ఇబ్బంది ఉండక పోవచ్చునని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

2022 నుంచి నేటి వరకు జీడీపీలో నీటి నిలువ ఉన్న పట్టిక

సంవత్సరం నెల నీటి నిలువ

సామర్థ్యం (టీఎంసీ)

2022 జూన్‌ 2

2022 జూలై 2.5

2023 జూన్‌ 1.65

2023 జూలె 0.75

2023 ఆగస్ట్టు 0.65

2024 ఆగస్టు 1

2025 ఆగసు 2(గ్రాస్‌)

2006 సెప్టెంబరు లో 1.8

Updated Date - Sep 24 , 2026 | 11:22 PM