టీడీపీలోకి 150 కుటుంబాలు
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:12 AM
చనుగొండ్ల గ్రామానికి చెందిన 150 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. బుధవారం పార్టీ కార్యాలయంలో గ్రామపెద్దలు చనుగొండ్ల శ్రీరాములు, బజారప్ప, వెంకోబరావు, మాధవయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు దశరథరామిరెడ్డి, ఉపాధ్యక్షుడడు ధర్మవరం సంజీవుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోట్ల సమక్ష్యంలో చేరారు,
డోన్ టౌన్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): చనుగొండ్ల గ్రామానికి చెందిన 150 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. బుధవారం పార్టీ కార్యాలయంలో గ్రామపెద్దలు చనుగొండ్ల శ్రీరాములు, బజారప్ప, వెంకోబరావు, మాధవయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు దశరథరామిరెడ్డి, ఉపాధ్యక్షుడడు ధర్మవరం సంజీవుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోట్ల సమక్ష్యంలో చేరారు, వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ ప్రజల పక్షాన నిలుస్తుందని, కార్యకర్తలకు అన్ని విదాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కోట్లను సన్మానించారు. లక్కసాగరం లక్ష్మీరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు సలీంధ్ర శ్రీనివాసులు, ఓబులాపురం శేషిరెడ్డి, బోడే శ్రీరాములు, బీసీ పెద్దయ్య, శివన్న, ఎం.పెద్దయ్య, డి.మాధవయ్య, చంద్రశేఖర్, ఈరన్న, శ్రీనివాసులు, తిమ్మప్ప, బోడే మద్దిలేటి ఉన్నారు.
గోసానిపల్లె గ్రామానికి చెందిన 50 కుటుంబాలవారు టీడీపీలో చేరారు. మాజీ ఎంపీటీసీ మదన్‌గోపాల్, మాజీ సర్పంచ్ మాధవస్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. గోసానిపల్లె ఎల్‌ఐసీ శ్రీరాములు, రాజశేఖర్ రెడ్డి గోసానిపల్లె నాయకులు పాల్గొన్నారు.