Share News

పోలీసు పీజీఆర్‌ఎ్‌సకు 128 ఫిర్యాదులు

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:30 PM

నగరంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎ్‌సకు 128 ఫిర్యాదులు వచ్చాయి.

పోలీసు పీజీఆర్‌ఎ్‌సకు 128 ఫిర్యాదులు
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు క్రైం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎ్‌సకు 128 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాదితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ హుస్సేన్‌ పీరా, సీఐలు శివశంకర్‌, మస్తాన్‌వలి, రామకృష్ణ పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ముగ్గురి నుంచి రూ.18 లక్షలు తీసుకుని మోసం చేసిన సంపంగి వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని కర్నూలు మండలం, దిన్నెదేవరపాడు చెందిన వెంకట సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల పేరిట నకిలీ ఐడీ కార్డులు, ఇంటర్వ్యూ లెటర్లు ఇచ్చి రూ.4 లక్షలు తీసుకున్నారని కల్లూరు మండలానికి చెందిన రవితేజ, జయచంద్ర ఫిర్యాదు చేశారు. తన తండ్రి 2021లో మరణించారని, అయితే తన తండ్రి 2024లో మాట్లాడినట్లు, నోటీసులు ఇచ్చినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి తనకు తెలియకుండా రూ.12 లక్షల విలువైన 2. 30 ఎకరాల భూమిని అక్రమంగా మ్యుటేషన్‌ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఉయ్యాలవాడకు చెందిన మల్లికార్జున ఫిర్యాదు చేశారు. ఆస్పరిలోని శాంతి హెల్పింగ్‌ మిషన్‌ అనాథాశ్రమానికి వివిధ కంపెనీల నుంచి రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఫండింగ్‌ ఇప్పిస్తామని ఆశ చూపి తమ వద్ద రూ.8 లక్షలు తీసుకుని మోసం చేసిన కదిరికి చెందిన మంజునాథ్‌పై చర్యలు తీసుకోవాలని ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన రమేష్‌ ఫిర్యాదు చేశారు.

Updated Date - Sep 28 , 2026 | 11:30 PM