Share News

పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 128 ఫిర్యాదులు

ABN , Publish Date - Jun 22 , 2026 | 11:05 PM

పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరి ష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో ఎస్పీ సునీల్‌ షెరాన్‌ స్వయంగా పాలొ ్గన్నారు.

పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 128 ఫిర్యాదులు
ఫిర్యాదిదారులతో మాట్లాడుతున్న ఎస్పీ సునీల్‌ షెరాన్‌

నంద్యాల క్రైం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరి ష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో ఎస్పీ సునీల్‌ షెరాన్‌ స్వయంగా పాలొ ్గన్నారు. ఫిర్యాదిదారుల నుంచి 128 దరాఖాస్తులు వివిధ సమస్యలపై అందజేశారు. ఫిర్యాదిదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి పరిష్కరిం చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఎస్పీ అధికారులతో మాట్లాడుతూ ఫిర్యాదులపై అలసత్వం వహించకూడదని, ఫిర్యాదులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.చట్టపరమైన సమస్యలపై తక్షణమే స్పందించి ఫిర్యాదిదారులకు న్యాయం చేయాలని, నిర్ణీత గడువులోగా ఫిర్యాదులకు అధికారులు పరిష్కారం చూపాలని సూచించారు. పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను జిల్లా ప్రధాన కార్యాలయానికి అందజేయాలని సూచించారు.

Updated Date - Jun 22 , 2026 | 11:05 PM