Share News

పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 127 అర్జీలు

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:27 PM

పట్టంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు.

పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 127 అర్జీలు
ఫిర్యాదిదారులతో మాట్లాడుతున్న ఏఎస్పీ

నంద్యాల క్రైం, జూలై 6 (ఆంధ్రజ్యోతి): పట్టంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 127 అర్జీలు అందజేశారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తులపై అధికారులు తక్షణమే స్పందించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని, వినతులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అడిషనల్‌ ఎస్పీ ఎస్‌.ఖాదర్‌బాషా ఆదేశించారు. ఫిర్యాదిదారులతో ఏఎస్పీ స్యయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని చట్ట పరిధిలోని సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2026 | 11:27 PM