122 ఫిర్యాదులు
ABN , Publish Date - Feb 23 , 2026 | 11:51 PM
122 ఫిర్యాదులు
విచారణ జరిపి న్యాయం చేస్తాం
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎస్పీ
కర్నూలు క్రైం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తామ ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 122 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుశేన్‌పీరా, సీఐలు రామకృష్ణ, విజయలక్ష్మి, మస్తాన్‌వలి పాల్గొన్నారు.