ప్రజా పరిష్కార వేదికకు 121 ఫిర్యాదులు
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:30 PM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
విచారణ జరిపి న్యాయం చేస్తాం
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని టూటౌన్ పోలీ్‌సస్టేషన్ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్ర మానికి మొత్తం 121 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, సీఐలు శివశంకర్, మస్తాన్‌వలి పాల్గొన్నారు.