పోలీసులకు 112 ఫిర్యాదులు
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:42 PM
జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో సోమవారం 112 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
కర్నూలు క్రైం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో సోమవారం 112 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. నేరుగా ఎస్పీ అర్జీలను స్వీకరించి బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను వేగవంతంగా విచారణ జరిపి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. బాధితులకు న్యాయం చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, రామయ్య నాయుడు, రామాంజులు పాల్గొన్నారు.