Share News

అరాచక పాలన వల్లే 11 సీట్లు

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:06 AM

అరాచక పాలన వల్లనే వైసీపీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని రోడ్లు భవనాల శాఖ మంత్రి విమర్శించారు.

అరాచక పాలన వల్లే 11 సీట్లు
ప్రసంగిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

వైసీపీపై మంత్రి బీసీ విమర్శ

బనగానపల్లె, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): అరాచక పాలన వల్లనే వైసీపీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని రోడ్లు భవనాల శాఖ మంత్రి విమర్శించారు. శుక్రవారం నంద్యాల జిల్లాలోని బనగానపల్లె పట్టణంలోని జీఎస్‌ఎస్‌ ఫంక్షన్‌హాల్‌లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం సుపరిపాలన, అభివృద్ధి నమ్మకం కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, బనగానపల్లె నియోజకవర్గంలోని అన్ని మండలాల అఽధికారులు, కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఐసీడీఎస్‌, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయశాఖ, విద్యాశాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. నియోజకవర్గం స్పెషల్‌ అధికారి శివప్రసాదరెడ్డి, ఆర్డీవో నరేంద్రనాథరెడ్డి, మండల స్పెషల్‌ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీ4 నియోజకవర్గం స్పెషల్‌ అఽధికారి రఘురాం బనగానపల్లె నియోజకవర్గం అభివృద్ధిపై నివేదిక చదివి వినిపించారు. టీడీపీ నాయకులు బనగానపల్లె మండల టీడీపీ అధ్యక్షుడు పీవీ. కుమార్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు టంగుటూరు శ్రీనయ్య, బురానుద్దీన్‌, అవుకు మండల టీడీపీ అధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి, బీజెపీ నాయకుడు లింగన్న, జనసేన నాయకుడు సురేశ్‌ టీడీనీ అబ్జర్వర్‌ పర్వీన్‌బాను తదితరులు పాల్గొన్నారు. మంత్రి బీసీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం డీఎస్సీ నియామకాలు చేపట్టి 16వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు. డీఎస్సీ ఫేక్‌ అంటూ వైసీపీ విషప్రచారాలు చేస్తున్నదని మండిపడ్డారు. అరాచక విధానాలు అనుసరించినందు వల్లే వైసీపీని ప్రజలు తిరస్కరించారని అన్నారు. దద్దనాల ప్రాజెక్టు లిప్ట్‌ ఇరిగేషన్‌ సౌకర్యం కల్పించిన ఘనత తమదే అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినరెండేళ్లలోనే రూ.1800 కోట్లతో బనగానపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Updated Date - Jun 20 , 2026 | 12:06 AM