నగరంలో 10కే రన్
ABN , Publish Date - Oct 25 , 2026 | 11:53 PM
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఆదివారం కర్నూలు నగరంలో 10కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కర్నూలు క్రైం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఆదివారం కర్నూలు నగరంలో 10కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రన్ పోలీసు శిక్షణా కేంద్రం నుంచి ప్రారంభమై రాగమయూరి టెంపుల్, కరెంటు ఆఫీసు మీదుగా వెళ్లి తిరిగి జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రానికి చేరుకుంది. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై అవగాహన పెంచడం ఈ 10కే రన్ ముఖ్య ఉద్దేశ్యమని పోలీసు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ దుర్గాప్రసాద్, సీఐలు లక్ష్మయ్య, వెంకటకృష్ణారెడ్డి, ఆర్‌ఐ నారాయణ, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డా. స్రవంతి, ఆర్‌ఎ్‌సఐలు, ట్రైనీ పోలీసులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.